కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం…మార్చి 1 నుంచి 60 ఏళ్ళు పైబడిన వారికి వాక్సినేషన్

-

కేంద్ర కాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 1 నుంచి 60 ఏళ్ళు పైబడిన వారికి “కోవిడ్” వాక్సినేషన్ ఇవ్వనున్నారు. అది కూడా ప్రభుత్వాసుపత్రిలో వాక్సినేషన్ పూర్తిగా ఉచితంగా ఇవ్వనున్నారు. అయితే  ప్రైవేట్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ వేయించుకునే వారు ధర చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, లేదా 45 ఏళ్ళు దాటి, తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమయ్యేవారికి కూడా 10,000 ప్రభుత్వ కేంద్రాలు మరియు 20,000 ప్రైవేట్ ఆసుపత్రులలో “కరోనా” టీకాలు ఇస్తారని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు.

ఇక దేశంలో ఐటి హార్డ్‌వేర్ ఉత్పత్తుల తయారీ కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని కూడా కేంద్ర క్యాబినెట్ ఆమోదించినట్టు ఆయన పేర్కొన్నారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు, ఐటి హార్డ్‌వేర్ వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ పథకం ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news