తెలుగు సినీ ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రల నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు చలపతిరావు. అయితే అనూహ్యంగా గుండెపోటు రావడంతో ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు. సుమారుగా 1200 కు పైగా సినిమాలలో నటుడుగా నటించారు.అయితే పలు అనారోగ్య సమస్యల కారణంగా ఈయన కొన్ని సంవత్సరాలు సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. కానీ చలపతిరావు జీవితంలో కూడా అనేక విషాదాలు ఉన్నప్పటికీ.. తను కూడా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండేవారని తన సన్నిహితులు చెబుతున్నారు.
కుటుంబానికి కూడా తెలియకుండా ఒక అమ్మాయి తనను ఇష్టపడిందనే కారణంతో ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నారట. అయితే అనారోగ్యంతో చలపతిరావు భార్య పెళ్లయిన కొద్ది సంవత్సరాలకి మరణించిందట. ఆమె మరణించే సమయానికి తన కొడుకు రవిబాబు వయసు 7 సంవత్సరాలట. ఆ తర్వాత చలపతిరావు మళ్లీ వివాహం చేసుకోలేదని.. చలపతిరావు కుటుంబ సభ్యులు ఎంత ఒత్తిడి చేసిన కూడా రెండో వివాహం ఒప్పుకోలేదట.
కేవలం తన పిల్లలని తన ఆస్తిక భావించి వారిని ప్రయోజకులు చేయడం కోసం ఎన్నో కష్టాలు పడ్డారని అతని సన్నిహితులు చెబుతున్నారు. తన తండ్రికి వివాహం చేయాలని చలపతిరావు కొడుకు రవిబాబు ఎన్నో ప్రయత్నాలు కూడా చేశారు.కానీ ఆయన మాత్రం ఒప్పుకోలేదట. సిల్లీ ఫెలోస్ అనే సినిమా షూటింగ్ సమయంలో ఒక మేజర్ యాక్సిడెంట్ కి గురయ్యారట. దీంతో 8ది నెలల పాటు వీల్ చైర్కే పరిమితమయ్యారట. దీంతో ఆ సమయంలో కంటిచూపు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఆ సమయంలో బోయపాటి శ్రీను వినయ విధేయత రామ సినిమా కోసం ఆయనని అడిగారట. అలా చక్రాల కుర్చీలో ఉండగానే ఇక్కడి నుంచి బ్యాంకాంగ్ తీసుకువెళ్లి మరి షూటింగ్ చేసినట్లు తెలియజేశారు. ఒకానొక సందర్భంలో చలపతిరావు సూసైడ్ చేసుకోవాలని భావించారట. ఆమధ్య ఒక ఆడియో ఫంక్షన్ లో మహిళలను ఉద్దేశించి చలపతిరావు చేసిన వ్యాఖ్యలు చాలా వైరల్ గా మారాయి. అలాంటి దుమారానికి కారణమైనది తనేనని..అలా తనపై చాలా నెగిటివిటీ రావడంతో తన పైన ట్రోలింగ్ జరగడంతో చనిపోవాలనుకున్నారట. కానీ చివరికి తన కుమారుడి మాటలతో డిప్రెషన్ నుంచి బయటికి వచ్చారని సమాచారం.