ఏపీలో ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర పైనే సమయం ఉంది..కానీ ఈలోపే ప్రధాన పార్టీలు ఓట్ల వేట మొదలుపెట్టాయి. ఎలాగైనా నెక్స్ట్ ఎన్నికల్లో గెలిచి తీరాలని పంతంతో ఇటు ప్రతిపక్ష టీడీపీ..అటు అధికార వైసీపీ ప్రయత్నిస్తున్నాయి. వాస్తవానికి నెక్స్ట్ ఎన్నికల్లో రెండు పార్టీలకు చావో రేవో లాంటివి అని చెప్పవచ్చు. అదేంటి ప్రస్తుతం వైసీపీ అధికారంలో ఉంది కదా..ఇంకా ఆ పార్టీ ఒకవేళ నెక్స్ట్ ఓడిపోతే ఇబ్బంది ఏంటి అని అనుకోవచ్చు. కానీ అది పొరపాటు..నెక్స్ట్ అధికారం కోల్పోతే..బాగా కసి మీద ఉన్న టీడీపీ అధికారంలోకి వస్తే ఏం జరుగుతుందో ఊహించుకోవడం కష్టం.
అదే సమయంలో మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ పరిస్తితి ఏం అవుతుందో చెప్పాల్సిన పని లేదు. పూర్తిగా రాజకీయ కక్షలతో సాగుతున్న ఏపీ రాజకీయాల్లో నెక్స్ట్ అధికారంలోకి రావడం అనేది రెండు పార్టీలకు కీలకమే. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది..ఇక టీడీపీకి ఎలా చుక్కలు కనబడుతున్నాయో చెప్పాల్సిన పని లేదు. దీంతో టీడీపీ శ్రేణులు రగులుతున్నాయి..అధికారంలోకి వస్తే తమ తడాఖా చూపించాలని ఉన్నాయి. కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో రెండు పార్టీలకు చావో రేవో అని చెప్పవచ్చు.
అందుకే ఇప్పటినుంచే అటు జగన్, ఇటు చంద్రబాబు..ప్రజల్లోకి వెళ్ళి ఓట్ల వేట కొనసాగిస్తున్నారు. ఎవరికి వారు తమదైన వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ప్రజల్ని ఆకట్టుకోవడానికి ఎవరి కాన్సెప్ట్ వారికి ఉంది. వైసీపీ ప్రభుత్వం వల్ల రాష్ట్రం నాశనం అయిందని, అన్నీ ధరలు పెరిగిపోయాయని, అరాచకాలు, అక్రమాలు, అవినీతి పెరిగిందని, పది రూపాయిలు ఇచ్చి వంద రూపాయిలు కొట్టేస్తున్నారని, తాను వస్తే రాష్ట్రాన్ని బాగుచేస్తానని, సంక్షేమాన్ని ఇంతకుమించి అమలు చేస్తానని, ఆదాయాన్ని సృష్టిస్తానని చంద్రబాబు ప్రజల్లోకి వెళ్ళి..తనని గెలిపించామని అంటున్నారు.
అసలు తాము చేసిన మంచి పనులు ఏ ప్రభుత్వం చేయలేదని, పేద ప్రజలకు సాయం చేశామని, 98 శాతం హామీలు అమలు చేశామని, చంద్రబాబు, పవన్ కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని, ప్రజలే తనకు అండగా ఉండాలని, తనకు ఓటు వేయని వారికి కూడా పథకాలు ఇచ్చానని చెప్పి జగన్ ప్రజల్లోకి వెళ్ళి వారి మద్ధతు కావాలని అడుగుతున్నారు. అంటే ఇక్కడ ఎవరికి వారు ఓట్లే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. మరి చివరికి ప్రజలు ఎవరి వైపు నిలుస్తారనేది 2024 ఎన్నికల్లో తేలుతుంది.