బాబర్ ఆజామ్ వరల్డ్ బెస్ట్ బ్యాట్స్మన్ : శ్రీలంక లెజెండ్ చమిందా వాస్

-

శ్రీలంక లెజెండ్ బౌలర్ చమిందా వాస్ నేటి ప్లేయర్ల ఆట విధానం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ తరపున మూడు ఫార్మాట్ లలో కెప్టెన్ గా జట్టును సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్న బాబర్ ఆజామ్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. వాసు మాట్లాడుతూ ప్రపంచం లోనే ది బెస్ట్ బ్యాట్స్మన్ బాబర్ అంటూ కొనియాడారు. కాగా బాబర్ టెస్ట్, వన్ డే మరియు టీ 20 లలో అగ్రగామిగా ఉన్నదంటూ పొగిడారు వాస్. ఇక అంతటితో ఆగకుండా వాస్ టీం ఇండియా ప్లేయర్ మరియు మాజీ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ గురించి సైతం కీలక కామెంట్స్ చేశాడు. విరాట్ కోహ్లీ ప్రతి మ్యాచ్ లోనూ భారీ స్కోర్ సాధించాలని అనుకుంటూ ఆ ఒత్తిడి వలన ఫెయిల్ అవుతూ ఉంటాడు అంటూ వాస్ కామెంట్ చేశాడు. కానీ కోహ్లీ ఫ్యాన్స్ ప్రతి మ్యాచ్ లోనూ సెంచరీ చెయ్యాలనో లేదా భారీగా పరుగులు చేయాలనీ కోరుకుంటారు, కానీ అన్ని సార్లు అలా జరగదు.

ఇందుకు అభిమానులు సిద్ధంగా ఉండాలంటూ ప్లేయర్ ల బాధను అర్ధం చేసుకోండి అన్న అర్ధంలో మాట్లాడారు వాసు.

Read more RELATED
Recommended to you

Exit mobile version