ప్రస్తుతం ఏదో చిన్న ఆధారం దొరకబుచ్చుకుని ఏపీలో కాషాయం జెండా పాతేద్దాం అని తెగ కృషిచేస్తున్న సోము వీర్రాజు కు సొంత ఇంటి సమస్యలు కాస్త ఎక్కువైనట్లే కనిపిస్తోంది! బీజేపీని నిలబెట్టాలని సోము వీర్రాజు తాపత్రయపడిపోతుంటే… బీజేఫీ మిత్రపక్షం జనసేన అధినేత పవన్ మాత్రం బాబును కూడా నిలబెట్టాలని తాపత్రయపడుతున్నారనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆ కామెంట్లు ఒకెత్తు అయితే… గ్రౌండ్ లెవెల్ లోకి వచ్చి పోరాడే విషయంలో కూడా సోము వీర్రాజును పవన్ శైలి ఇరకాటంలో పెడుతుందని అంటున్నారు విశ్లేషకులు.
టీడీపీ అధినేత చంద్రబాబు పేరు చెబితే అంతెత్తున లేచే వీర్రాజు.. తనకు రాజకీయంగా ఊపిరున్నంతకాలం బాబుకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తోడుండాలని పరితపించే పవన్ మరోవైపు! ఈ త్రికోణం రాజకీయ ప్రేమల్లో పవన్ కు బాబు కు మధ్య వీర్రాజు నలిగిపోతున్నారనే చెప్పుకోవాలి. తాజాగా జరిగిన ఒక సంఘటన.. పవన్ విషయంలో వీర్రాజుని ఇరకాటంలో పాడేసిందని అంటున్నారు!
ఆలయాలపై జరుగుతున్న దాడులపై చంద్రబాబు ట్విట్టర్ స్పందనలపై స్పందించిన వీర్రాజు… “హైదరాబాద్‌లో ఉండి మాట్లాడడం పెద్ద విషయం కాదు.. అసలు బాబును పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆయనకు మాట్లాడే అర్హత లేదు” అని అన్నారు వీర్రాజు. దీంతో వెంటనే పవన్ కూడా ఫ్రం హైదరాబాద్ ఆన్ లైనే కదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో వీర్రాజు ఇరుకునపడుతున్నారట! పవన్ పద్దతివల్ల బాబును అనలేకపోతున్నామనేది వీర్రాజు బాదంట!
మరి బహిరంగ మిత్రుడూ వీర్రాజు బాద అర్ధం చేసుకుని అయినా పవన్ కాస్త భాగ్యనగరం వదిలి బయటకు వస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారంట బీజేపీ శ్రేణులు. మరి ఈ బహిరంగ మిత్రుడి బాదను పవన్ అర్ధం చేసుకుంటారా లేక రహస్య మిత్రుడు బయటకొచ్చేవరకూ తానుకూడా రానంటూ ఉండిపోతారా అనేది వేచి చూడాలి!!
-CH Raja