చంద్రబాబు నాయుడు తన పార్టీ తరపున మీడియా ముందు గట్టిగా అధికారపార్టీకి కౌంటర్లు వేయడానికి కొత్త ఫైర్ బ్రాండ్ రంగంలోకి దింపినట్లు టిడిపి పార్టీలో టాక్. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో చాలా దారుణంగా ఇరవై మూడు స్థానాలే రావటం తో చాలా బలహీనమైన ప్రతిపక్ష పాత్ర ఏపీలో పోషిస్తోంది. ఇటువంటి తరుణంలో అధికారంలో ఉన్న వైసిపి పార్టీ నాయకులు మీడియా ముందు టిడిపి నాయకులను ఉద్దేశించి భయంకరమైన విమర్శలు చేస్తున్నారు. అయితే టిడిపి నుండి కౌంటర్లు ఇవ్వటానికి ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ప్రస్తుతం కనబడటం లేదు.
ఇటువంటి తరుణంలో కేంద్రంలో బిజెపి పార్టీకి కొంచెం దగ్గరగా వైసిపి పార్టీ అడుగులు వేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఐఎం పార్టీ తో జత కట్టి వైసిపి పార్టీ పై కొత్త ఫైర్ బ్రాండ్ దింపడానికి అంత స్కెచ్ రెడీ చేశారు. విషయంలోకి వెళితే కేంద్రం తీసుకొచ్చిన సిఏఏ ను వ్యతిరేకిస్తూ వస్తున్న ఎంఐఎంకు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ సపోర్ట్ గా నిలిచింది. ఎంపీ కేశినేని నాని ఈ విషయంలో చొరవచూపినట్టుగా తెలుస్తోంది.
కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఇటీవలే కడపలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అలానే విజయవాడలో భారీ సభ ఎంఐఎం పార్టీ తో కలిసి ఏర్పాటు టిడిపి చేయడానికి రెడీ అవుతుంది. ఇటువంటి తరుణంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ నీ రంగంలోకి కొత్త ఫైర్ బ్రాండ్ గా దింపి జగన్ ని టార్గెట్ చేసి మైనార్టీ ఓటు బ్యాంకు ని దూరం చేయాలని చంద్రబాబు సరికొత్త స్కెచ్ వేసినట్లు ఏపీ రాజకీయాల్లో వినబడుతున్న టాక్.