చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా వైరస్ కట్టడి చేయడంలో విఫలం అయిందని ప్రజలకు లెటర్ రాయడం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయ్యింది. చంద్రబాబు రాసిన లెటర్ పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు వలన వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని తెలిపారు. అంతేకాకుండా చాలా నిర్లక్ష్యంగా ఈ ప్రమాదకరమైన వైరస్ ని ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్నారని, అందువలన ప్రజల్లో భయం లేకుండా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించే విధంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు లెటర్లో చెప్పుకొచ్చారు.ఈ విషయం నడుస్తూ ఉండగానే అధికార పార్టీ నేతలు చేస్తున్న అత్యుత్సాహం వల్ల కూడా వైరస్ వ్యాప్తి రాష్ట్రంలో ఎక్కువైందని ఈ విషయంలో ప్రభుత్వం శ్రద్ధ చూపాలని అప్రమత్తం చేయడం జరిగింది. చంద్రబాబు లెటర్ రాయడం పట్ల జనాల్లో కి వేరేలాగా వెళుతుంది అనే ఆలోచనతో అధికార పార్టీ నేతలు విమర్శల దాడికి పాల్పడ్డారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ప్రజలను భయపెట్టే కార్యక్రమం చేయటం స్టార్ట్ చేశారని వైసీపీ నేతలు మాటల దాడి కి రెడీ అయ్యారు.
దేశం లో అన్ని రాష్ట్రాల్లో ఉన్న ప్రతిపక్ష-అధికార పార్టీ నేతలు ఇలాంటి క్లిష్ట సమయం లో కలిసి పని చేస్తుంటే.. రాష్ట్ర దౌర్భాగ్యం ఏమో తెలియదు గానీ ప్రతిపక్ష నేత వేరే రాష్ట్రంలో ఉండి ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు చేశారు. ఈ విషయం నడుస్తూ ఉండగానే తాజా పరిస్థితులు బట్టి చూస్తే రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడిలో వైసిపి ప్రభుత్వం సరైన పద్దతి లో డీల్ చేయలేకపోయిందని అంటున్నారు. చంద్రబాబు రాసిన లెటర్ చూస్తే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడం తప్ప భయపెట్టిన సందర్భాలు ఏమీ లేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.