కాసేపటి క్రితమే ఢిల్లీకి టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరియు ఆ పార్టీ కీలక నేతలు చేరుకున్నారు. రెండేళ్ళ తర్వాత తొలిసారిగా ఢిల్లీ కి వచ్చిన నారా చంద్రబాబు నాయుడు… ఈ రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు రాష్ట్రపతి రామనాధ్ కోవింద్ తో సమావేశం కానున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని ఈ సందర్భంగా కోరనున్నారు చంద్రబాబు నాయుడు.
అలాగే ఇటీవల టిడిపి కార్యాలయం పై జరిగిన దాడులు, టిడిపి కార్యకర్తలు, నాయకుల నిర్బంధాలు, వేధింపులు పై సిబిఐ దర్యాప్తు ను కోరనున్నారు చంద్రబాబు. ఏపిలో శాంతి భద్రతలు అధ్వాన్నంగా ఉన్నాయని, డిజిపి తో సహా పోలీసు వ్యవస్థ పూర్తిగా అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా వివరించనున్నారు.
విజ్ఞాపన పత్రంలో గంజాయ్, హెరాయన్ అంశాలను కూడా వివరించనున్న చంద్రబాబు.. ప్రధాని మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా లను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. అయితే… ఇంత వరకు వారి అపాయింట్ మెంట్లు ఖరారు కాలేదు.