కొడాలి మాటలు నిజం చేస్తున్న బాబు…ఇంకా సర్దుకోవడమేనా…

-

ఏపీ మంత్రి కొడాలి నాని…ఎప్పుడు టి‌డి‌పి అధినేత చంద్రబాబుపై విమర్శలు చేస్తారనే సంగతి తెలిసిందే. తనదైన శైలిలో బాబుపై విరుచుకుపడతారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే….కొడాలి ఎప్పుడు బాబుని తిడతారు గానీ, తెలుగుదేశం పార్టీని అనరు. ఎందుకంటే ఈ పార్టీ సంగతి కొడాలికి బాగా తెలుసు. కానీ బాబు వల్లే పార్టీ నాశనమైపోతుందని కొడాలి ఎప్పటికప్పుడు విమర్శిస్తుంటారు.

kodali-nani

తాజాగా ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల ఫలితాలు వచ్చాక అదే స్థాయిలో విమర్శించారు. టీడీపీ నాశనానికి కారణమవుతున్న చంద్రబాబుకు బడితెపూజ చేసి కృష్ణానదిలో పడేయాలని కొడాలి తీవ్ర స్థాయిలో మాట్లాడారు. అయితే విమర్శలు సంగతి ఎలా ఉన్నా ఇక్కడ బాబు వల్లే పార్టీ దెబ్బతింటుందని అర్ధమవుతుంది. ఇక ఇదే అంశంపై టి‌డి‌పి కార్యకర్తలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని నాని అంటున్నారు.

అయితే వాస్తవానికి చూస్తే ఎన్టీఆర్ తర్వాత టి‌డి‌పిని నిలబెట్టిందే చంద్రబాబు….ఇన్నేళ్లు పార్టీ సక్సెస్‌ఫుల్‌గా నడవటానికి కారణం చంద్రబాబే. అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఎప్పుడైతే తన వారసుడు లోకేష్‌ని రంగంలోకి దింపారో అప్పటినుంచి పార్టీకి డ్యామేజ్ జరుగుతూ వస్తుంది. అసలు పార్టీని లోకేష్‌కు తగ్గట్టుగా నడపటం మొదలుపెట్టారు. దాని వల్ల పార్టీకి ఎంత నష్టం జరగాలో అంత నష్టం జరిగింది. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత నుంచి కూడా టి‌డి‌పికి ఏది కలిసిరాలేదు. వరుసపెట్టి పార్టీ ఓడిపోతూనే వస్తుంది. పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో చిత్తు అయింది.

ఇలా వరుసగా పార్టీ ఓడిపోతున్నా సరే తప్పు ఎక్కడ జరుగుతుందనే విషయాన్ని  వదిలేసి కేవలం వైసీపీ అరాచకాల వల్లే పార్టీ ఓడిపోతుందని బాబు నమ్మడం అవివేకమే అవుతుంది. తన తప్పుని తెలుసుకోకుండా బాబు, జగన్ కుట్రలు, అరాచకాలు వల్ల పార్టీ ఓడిపోతుందని బీదఅరుపులు అరిస్తే….టి‌డి‌పికే పెద్ద బొక్క పడేలా ఉంది. ఏదేమైనా కొడాలి నాని అన్నట్లు బాబు వల్లే పార్టీ నాశనమవుతుందని సొంత పార్టీ కార్యకర్తలకే డౌట్ వచ్చే పరిస్తితి వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news