జగన్ సర్కార్ పై మరోసారి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. అమరావతి రైతుల శాంతియుత పాదయాత్రపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని… అమరావతిని ఆపేసి క్షమించరాని తప్పు చేశారని జగన్ సర్కార్ సీరియస్ అయ్యారు. రైతుల పాదయాత్ర ను అడ్డుకుని చరిత్ర హీనులుగా మిగలొద్దని వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు. అమరావతి రైతుల పాదయాత్ర కు ప్రజలు నుంచి వస్తున్న మద్దతు చూసి వైసీపీ ఓర్వలేక పోతోందని మండిపడ్డారు.
కోర్టు అనుమతిచ్చిన పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నించడం హేయమైన చర్య అని నిప్పులు చెరిగారు. పాదయాత్ర ను కోవిడ్ ఆంక్షల పేరుతో అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. జగన్ చేసిన ప్రజాసంకల్ప యాత్రకు 4 ఏళ్ళు అని నిన్న వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు చేసి బహిరంగ సభలు పెట్టారని గుర్తు చేశారు. వైసీపీకి లేని కరోనా నిబంధనలు రైతుల పాదయాత్రకు వర్తిస్తాయా? అని నిలదీశారు. సీఎం జగన్ కు ప్రజా వ్యతిరేకత పెరుగుతుండటంతో ప్రజల్ని పోలీసులతో అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.