కన్నా నిష్క్రమణ – సోము ఎంట్రీ… బాబుకు మిగిలింది ఆ ఒక్క ఆప్షనే!!

-

జగన్ రాజకీయ ఎత్తుగడల్లో భాగమో లేక బీజేపీ పరిపక్వ ఆలోచనల్లో భాగమో తెలియదు కానీ… బాబు భజన చేస్తున్నారనే విమర్శను ఎదుర్కొంటున్న కన్నా లక్ష్మీనారాయణను తొలగించి.. బాబు పేరుచెబితేనే ఫైరయిపోయే సోము వీర్రాజుకు ఏపీ పార్టీ బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం. ఈ క్రమంలో.. కన్నా కంటే, ఆయన ఫ్యాన్స్ కంటే ఎక్కువగా ఫీలవుతున్నది ఎవరైనా ఉన్నారంటే… అదీ చంద్రబాబు – టీడీపీ నేతలే!

ఈ క్రమంలో… చంద్రబాబు గతవైభవంలో ఏనాడూ ఒంటరిగా పోటీ చేసి అధికారంలోకి వచ్చింది లేదు! కాబట్టి… ఆయనకున్న బీజేపీ ఆప్షన్ దాదాపు పోయినట్లే. ఎందుకంటే… రాబోయే ఎన్నికల్లో బీజేపీ – జనసేనే కలిసి పోటీచేస్తాయనే విషయంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు సోము వీర్రాజు. పోనీ బాబు ఢిలీ స్థాయిలో ఏమైనా నరుక్కొస్తారా అంటే… ఆ పరిస్థితులు ప్రస్తుతానికి బాబుకి హస్తినలో లేవనే చెప్పాలి. కరోనా సమయంలో ఊరు దాటతామంటేనే అనుమతి దక్కని బాబుకి.. పార్టీతో పొత్తు అంటే ఫోన్ లు కూడా ఎత్తరు హస్తినలోని బీజేపీ పెద్దలు!

ఈ క్రమంలో బాబు 2014లో ఒంటరిగా పోటీ చేయాలి.. లేదంటే కమ్యునిస్టులతో కలిసి ముందుకెళ్లాలి. అది కూడా నేటి పరిస్థితుల్లో అస్సలు సక్సెస్ అయ్యే కాంబినేషనే కాదు! ఇక గత ఎన్నికల్లో బీజేపీకంటే ఎక్కువ ఓటు బ్యాంకు సంపాదించిన కాంగ్రెస్ పార్టీతోనే బాబు కలిసి ముందుకు వెళ్లాలి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవనవ్సరం లేదు. ఆ పార్టీలోని కొందరు నేతలు బాబు భజన చేస్తూ ఉన్నప్పటికీ వారి నుంచి వచ్చే ఓట్లు నోటాను కూడా దాటవనేది గతం చెబుతున్న భవిష్యత్తు!

మరి ఈ సమయంలో బాబుకి ఉన్న ఆప్షన్ ఏమిటి? ఏమీ లేదు… ఒంటరిగా పోటీ చేయడమే. ఆ పదం వింటేనే బాబుతోపాటు తెలుగు తమ్ముళ్లకు కూడా ఫ్యూచర్ అర్ధమైపోతుంటుంది. మరి ఈ పరిస్థితుల్లో బాబు ఏమి చేస్తారు? ఎలా చేస్తారు? పార్టీకి వయసైపోయింది.. అధినేతకూ వయసుమీదపడిపోయింది అన్న కామెంట్ల నడుమ… బాబు తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయన్నది వేచి చూడాలి!!

Read more RELATED
Recommended to you

Latest news