చంద్రబాబు రాజకీయాలపై సోషల్ మీడియాలో సటైర్లు పేలుతున్నాయి. “ఇది కూడా ఓర్చుకోలేక పోతే.. జాతి క్షమించదు బాబూ“ అని నెటిజన్లు సటైర్లు విసురుతున్నారు. ఏడాది కాలంగా.. చంద్రబాబు చేస్తు న్న విమర్శలను గమనిస్తున్న సోషల్ మీడియా జనాలు.. ఇప్పుడు మాత్రం కొంత కఠినంగానే మాట్లాడుతు న్నారు. విషయంలోకి వెళ్తే.. తాజాగా సీఎం జగన్ జూలై 8 వ తేదీని రైతు దినోత్సవంగా అధికారికంగా నిర్వ హిస్తున్నారు. వాస్తవానికి గత ఏడాదే.. దీనిని ప్రకటించారు. ఆ రోజే ఆయన రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఈ ఏడాద అక్టోబరు నుంచి ప్రారంభిస్తానని ఎన్నిక ల సమయంలో హామీ ఇచ్చినా.. రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఏడాది ముందుగానే ప్రారంభించారు.
ఇక, ఈ రైతు భరోసాపైనే వివాదం చెలరేగి.. ఇది కేంద్ర ప్రభుత్వ పథకమని, కేంద్రం ఇస్తున్న సొమ్ములు కూడా ఉన్నాయని బీజేపీ నేతలు కోరడంతో వైఎస్ జగన్ ఎక్కడా తర్జన భర్జనకు తావివ్వకుండా వెంటనే దీనిని పీఎం కిసాన్ వైఎస్సార్ రైతు భరోసాగా పేరు మార్చారు. ఇక, తాజాగా ఆయన రైతులకు ఇవ్వాల్సిన నిధులను వారి వారి అకౌంట్లలో వేశారు. అంతేకాదు, గత చంద్రబాబు ప్రభుత్వం రైతులకు బాకీ పెట్టిన 88 కోట్లను కూడా జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. నిజంగా ఇది చంద్రబాబు అభినందించాల్సిన విషయం.
తాను ఇచ్చిన హామీలను కూడా జగన్.. అమలు చేస్తున్నారు. అదేసమయంలో రుణాలను సకాలంలో చెల్లించిన వారికి వడ్డీ మాఫీని కూడా ప్రకటించారు. ప్రస్తుతం అనేక సమస్యల్లో ఉన్న రైతులకు ఈ ప్రకటన నిజంగానే నెత్తిన పాలు పోసేదే! ఈ విషయంలో రైతులు ఫుల్లుగా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాల్లో రైతులు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తు న్నారు. దీనిని ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా అభినందించాల్సిన ఘటన. పోనీ.. అభినందించ కపోతే.. కనీసం సైలెంట్‌గా ఉన్నా సరిపోయేది. కానీ, చంద్రబాబు మాత్రం చిత్రంగా స్పందించి వివాదాలకు కేంద్రంగా మారిపోయారు.
“ఇది రైతు దినోత్సవం కాదు.. రైతు దగా దినోత్సవం“ అంటూ వ్యాఖ్యలు గుప్పించారు. దీనిపై సోషల్ మీడియాలో సటైర్లు పేలుతున్నాయి. “అయ్యా బాబు గారు .. మీరు ఇస్తానని ఎగ్గొట్టిన రుణాలు కూడా ఇప్పుడు జగన్ ఇస్తున్నాడు. చెరుకు రైతులకు మీరు పిప్పి మిగిలిస్తే.. జగన్ వచ్చి వారి కళ్లలో నీళ్లు తుడుస్తున్నారు. అయినా ఇంత ఏడుపు ఎందుకండీ!“ అని ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి బాబు ఏం సమాధానం చెబుతారో చూడాలి.