చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది.. అసలు టీడీపీ ఉంటుందా.. ఉన్నా కూడా అది చంద్రబాబు చేతుల్లో ఉంటుందా.. ఈ సమయంలో వ్యక్తిగత ప్రతిష్ట కోసం ఆలోచించాలా.. పార్టీ భవిష్యత్తు కోసం నిర్ణయించాలా.. కొడుకు గొప్పా.. లక్షల మంది నమ్ముకున్న పార్టీ గొప్పా..? ప్రస్తుతం బాబు మదిలో మెదులుతున్న ప్రశ్నల్లో ఇవి కొన్ని మాత్రమే!!
అవును… ఏపీ టీడీపీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో ఎంతో “మేథోమథనం” చేసిన చంద్రబాబుకు అచ్చెన్నాయుడి పేరు ఫైనల్ చేస్తే బాగుంటుంది.. కాస్త పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుంది అని తేలిందంట. మరీ కళా వెంకట్రావులా రబ్బరు స్టాంపులా ఉంచకుండా కాస్త దూకుడు ప్రదర్శించే ఫ్రీడం ఇస్తే.. పార్టీని ఎంతో కొంత ముందుకు తీసుకెళ్తాడు.. కేడర్ కు కూడా కొత్త ఉత్సాహాన్ని ఇస్తాడు అని తెలిసిందంట!!
ఇంతవరకూ మేథోమథనం రిజల్ట్ బాగానే ఉన్నట్లు తమ్ముళ్లు అభిప్రాయపడుతున్నారు! కథ కథనం అక్కడితో అయిపోతే ఇంక చంద్రబాబు గొప్పే ముంది! “మేథోమథనం” పూర్తయిన అనంతరం “అంతర్మథనం” లోకి వెళ్లారంట చంద్రాబు. అదేమి చెప్పిందో ఇప్పుడు చూద్దాం!
కళా వెంకట్రావు లాంటి నాయకులను పార్టీ అధ్యక్షులుగా ఉంచితే… నేడు చంద్రబాబుకి కానీ, రేపు చినబాబుకి కానీ ఎలాంటి ఇబ్బందులూ ఉండవని…. అలా కానిపక్షంలో అచ్చెన్న అసెంబ్లీలో చూపించే దూకుడే పార్టీ అధ్యక్షుడిగా బయటకూడా చూపిస్తే… కచ్చితంగా చంద్రబాబుతో అచ్చెన్నా సమానం కాకపోయినా… బాబు తర్వాత అనుకుంటున్న చినబాబు స్థానాన్ని మాత్రం కచ్చితంగా కబ్జా చేస్తారని అంటుందంట అంతర్మథనం!!
ఆరునెలలు సావాసం చేస్తే వారు వీరవుతారు.. వీరు వారవుతారు అన్నట్లుగా… ఇంతకాలం తనపక్కనుండి రాజకీయాలు బాగా వంటపట్టించుకున్న అచ్చెన్నకు మరీ ఫ్రీడం ఇస్తే… తనకు ఎక్కడ వెన్నుపోటు పొడుస్తాడోనన్న భయం కూడా మెల్లగా మొదలైంది అంట!! ఈ భయం పెదబాబుకే అంతుంటే.. ఇక చినబాబు సంగతి చెప్పేదేముంది! దీంతో… న్నాన్నారు నాన్నారు అచ్చెన్నాకుంల్ ని అధ్యక్షుడిగా చేయవద్దు అని చినబాబు చంద్రబాబుతో అన్నాడని, అందుకే అచ్చెన్న ఎంపిక పునఃపరిశీలనలో ఉందని అంటున్నారు!!
మరి ఇన్ని ఆలోచనలు, మరిన్ని ఆందోళనలన నడుమ చంద్రబాబు మేథోమథనం – అంతర్మథనం లలో దేనికి ఎక్కువ విలువనిస్తారనేది వేచి చూడాలి!! ఒకవేల అంతర్మథనానికే ఎక్కువ విలువిస్తే… ఆశ చూపించిన అచ్చెన్నకు ఎలాంటి “కథనం” అల్లి చూపిస్తారో కూడా వేచి చూడాలి!!
-CH Raja