అవును! ఇప్పుడు ఫార్టీ పొలిటికల్ ఇండస్ట్రీ.. టీడీపీ అధినేత చంద్రబాబు అనుభవానికే పెద్ద పెను పరీక్ష ఎదురైంది. ఏ తప్పు చేయలేదు.. చేయను!! అని పదే పదే చెప్పుకొనే ఆయనకు ఇప్పుడు సంజాయిషీ ఇ చ్చుకోక తప్పని పరిస్తితి ఏర్పడింది. దీనికి ప్రధాన కారణం.. నవ్యాంధ్ర రాజధాని అమరావతి. ప్రస్తుత వైసీ పీ ప్రభుత్వం గత చంద్రబాబు పాలనలో తీసుకున్న నిర్ణయాలను ఆమూలాగ్రం సమీక్షిస్తున్న విషయం తెలి సిందే. ఈ క్రమంలోనే రాజధాని అమరావతికి సంబంధించిన భూ సమీకరణ, కేటాయింపు, రైతులకు రీ సెటిల్మెంట్, ప్లాను, సింగపూర్ కంపెనీలతో ఒప్పందం వంటి వాటిని తిరగదోడింది.
ఈ క్రమంలో వెలుగు చూసిన విషయాలను ఇటీవల రెండు రోజుల కిందట వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షి గా వివరించింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలు వెలుగు చూశాయి. ప్రతి విషయంలోనూ చంద్రబాబు ప్రభుత్వం నాడు తన వారికి పప్పు బెల్లాలు, కాని వారిపై కేసులు చందం గా వ్యవహరించిందని సభలోనే వైసీపీ ప్రభుత్వం చెండాడింది. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి సమాధానం ఇస్తారు? ఎలా వ్యవహరిస్తారు? అనే ప్రశ్నలు సర్వత్రా వినిపించాయి. కానీ, నాటి సభ నుంచి టీడీపీ సభ్యులు వాకౌట్ చేయడం మినహా ప్రభుత్వం లేవనెత్తిన సందేహాలు.. సంధించిన ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలూ చెప్పలేక పోయింది.
దీంతో ఇప్పుడు ఇదే అంశాలపై సోషల్ మీడియాలో చంద్రబాబును టార్గెట్ చేస్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. నిజానికి చంద్రబాబు పారదర్శకంగా వ్యవహరించి ఉంటే.. వీటికి సమాధానాలు చెప్పుకొనే పరిస్థితి ఉంటుందని, కానీ,ఇప్పుడు ఆయన ఎందుకు తప్పించుకుని తిరుగుతన్నారని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం ఉందాలేదా? అనే విషయంలో చంద్రబాబు టాపిక్‌ను డైవర్ట్ చేశారని అంటున్నారు.
అలా కాకుండా ఇతమిత్థంగా తనపైనా. పార్టీపైనా వచ్చిన విమర్శలకు ఆయన వివరణ ఇచ్చుకుని ఇవన్నీ రాజకీయ దురుద్దేశంతోనే వైసీపీ ఆరోపించిందనో .. లేక తాను నిజాయితీగా ఉన్నాననో చెప్పుకొనే అంశం నుంచి ఆయన పక్కకు జరుగుతున్నారనే విషయాన్ని సోషల్ మీడియా ప్రధానంగా ప్రశ్నిస్తోంది. మరి దీనికి బాబు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.