ఇదిగో ఫ్రూఫ్: బాబుకి తెలంగాణ అంటే ఎంత ప్రేమో తెలుసా?

-

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా? ఉంది. ఎందుకు లేదు..? అక్కడ కూడా పార్టీ ఉండబట్టే కదా అది జాతీయ పార్టీ అవ్వడం, ఆ జాతీయ పార్టీకి బాబు అధ్యక్షుడిగా ఉన్నది. అంతే కాదు తెలంగాణ టీడీపీ రాష్ట్ర శాఖకు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను కూడా ఎంపిక చేశారు కదా! అయితే… తెలంగాణలో టీడీపీ ఉన్నట్లే.. అవును అవును, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆ పార్టీ (తెలంగాణ) నేతలు ఎన్టీఆర్ భవన్ లో వేడుకలు జరుపుకున్నారు కూడా! కానీ.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఎందుకు గుర్తులేదు? అలా ఏమీ లేదు… ఆ రోజున బాబు – చినాబాబు కాస్త బిజీగా ఉండి ఉండొచ్చు! అలా అపార్ధం చేసుకోవద్దు.. బాబుకు తెలంగాణ అంటే ఎంత ప్రేమో!

నాడు కేసీఆర్ చెబుతున్న చాలా ప్రాజెక్టులకు బాబు తాను అధికారంలో ఉండగానే ఆలోచనలు చేశారు.. అంత ప్రేమ తెలంగాణ అంటే!

నాడు తెలంగాణ ఉద్యమం – సమైక్యాంధ్ర ఉద్యమం ఉవ్వెత్తున లేచినప్పుడు తెలంగాణను వదలకుండా ఒక కన్ను చేసుకున్నారు… అంత ప్రేమ తెలంగాణ అంటే!

ఒక్కసీట్లు, నాలుగు ఓట్లు రాకపోయినా తెలంగాణ ప్రజలకు ఏదో చేయాలనే కదా… ఇక్కడ కూడా పార్టీని నడుపుతుంది… అంత ప్రేమ తెలంగాణ అంటే!

రాష్ట్రం విడిపోయినా.. అమరావతిలో ఇళ్లు ఉన్నా.. పనంతా అక్కడే ఉన్నా.. కనీసం వారానికి నాలుగు రోజులు, ఇప్పుడైతే నెలకి 30 రోజులు హైదరాబాద్ లోనే ఉంటున్నారు… అంత ప్రేమ తెలంగాణ అంటే!

తాను హాజరుకాకపోయినా, తన పుత్రుడిని పంపకపోయినా… తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ఆ పార్టీ (తెలంగాణ) నేతలు ఎన్టీఆర్ భవన్ లో వేడుకలు జరుపుకోవడానికి అనుమతి కూడా ఇచ్చారు… అంత ప్రేమ తెలంగాణ అంటే!

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రజలకి కాకపోయినా… అదే రోజు పుట్టినరోజు జరుపుకున్న తెలంగాణ గవర్నర్ తమిళసైకి శుభాకాంక్షలు తెలిపారు… అంత ప్రేమ తెలంగాణ అంటే!

కానీ… తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున చంద్రబాబు కానీ, చినబాబు కానీ ఒకటంటే ఒక ట్వీట్ చేయలేదు ఎందుకు? తమ పార్టీకి చెందిన నాయకుల బర్త్ డేలకు రోజూ మెసేజ్ లు పెట్టే వీరికి.. రాష్ట్రం మొత్తం ఎంతో ఘనంగా, గర్వంగా జరుపుకునే ఆవిర్భావ దినోత్సవం రోజున శుభాకాంక్షలు చెప్పాలనే తలంపు రాలేదా? వచ్చినా ట్వీట్ చేసే ధైర్యం రాలేదా? కనీసం తెలంగాణ టీడీపీ అకౌంట్ నుంచి పెట్టిన మెసేజ్ ని కూడా రీట్వీట్ చేసే ఆలోచన కూడా తట్టలేదా? తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున శుభాకాంక్షలు చెప్పినంత మాత్రాన్న ఏపీ వాసులు చంద్రబాబుని ఏమైనా అనేస్తారా ఏమిటి? ఇది బాబు పద్దతంతే… లేకపోతే, తెలంగాణ పై ఇంత ప్రేమ ఉన్న చంద్రబాబుకి నాలుగు ఓట్లు కూడా వేయరా.. ఒక్క సీటు కూడా గెలిపించరా? ఇప్పుడు బాగా అయ్యింది కదా… ఆవిర్భావ దినోత్సవం రోజున బాబు విషేస్ పొందలేకపోయారు!!

Read more RELATED
Recommended to you

Latest news