చంద్రబాబు-పవన్ లిక్కర్ పాలిటిక్స్ కి జగన్ మార్కు కౌంటర్స్!

-

తాజాగా చంద్రబాబు పార్టీ సీనియర్లతో వీడియో కాంఫరెన్స్ ఏర్పాటు చేసి మాట్లాడుతూ… ఏపీలో మద్యం అమ్మకాలపై విరుచుకుపడ్డారు! అసలు ఏపీలో వైన్ షాపులు ఓపెన్ చేయడం ఏమిటని సీరియస్ అవుతున్నారు! ఇందులో కొందరు టీడీపీ నేతలైతే… ఇదే అదనుగా మద్యపాన నిషేధం చేసేయ్యాలని కోరుతున్నారు! ఇంతవరకూ బాగానే ఉంది కానీ… ఈ మద్యం దుకాణాల రీ ఓపెన్ విషయంలో ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారు చంద్రబాబు అనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి! ఈ విషయంలో కూడా చంద్రబాబునే ఫాలో అవుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంట! ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలని భావిస్తూ… మద్యం షాపుల పేరుచెప్పి బాబు అండ్ కో చేస్తున్న విమర్శల్లో పస ఎంత… ఆ విమర్శలకు ఎదురవుతున్న ఎదురుప్రశ్నల వాడి వేడి ఎంత అనేది ఇప్పుడు చూద్దాం!

ఏపీలో మద్యం అమ్మకాలపై కేంద్రం సూచనల మేరకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మైకలులందుకున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్! మద్యం నిత్యావసర వస్తువా? అని విమర్శలు చేశారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ… మద్యం షాపులు ఓపెన్ చేయకూడదు అనే సిద్ధాంతానికే కట్టుబడి ఉండకుండా… మళ్లీ పెరిగిన మద్యం ధరలపై నోరు జారారు! మద్యం రేట్లు ఎలాపడితే అలా పెంచేస్తే… పేదవారు కొనగలరా అని బాధపడుతున్నారు! సరైన బ్రాండ్లు అమ్మడం లేదని గొడవ చేస్తున్నారు! కొత్త కొత్త బ్రాండ్లు అమ్మడం ఏమిటని కొందరు టీడీపీ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు! ఇక్కడే వీరంతా… దొరికిపోతున్నారు! విమర్శలకే వీరి ప్రాధాన్యత తప్ప… విషయానికి కాదని దీంతో తేటతెల్లమవుతుంది!

ఈ విషయంలో ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారేతప్ప… “మద్యం జోలికెళ్లకండి తమ్ముళ్లూ” అంటూ మందుబాబులకి ఒక స్టేట్ మెంట్ మాత్రం ఇవ్వలేకపోతున్నారు చంద్రబాబు అండ్ కో! ఎందుకంటే… తొలిరోజు మద్యం దుకాణాల క్యూలు కట్టినవారిలో టీడీపీ – జనసేన సానుభూతిపరులు ఉండకుండా ఉండకపోవచ్చు కాబట్టి! కనీసం వారు అయినా వీరి మాట వింటారేమో పరిశీలించవచ్చు! పోని ఇవన్నీ పక్కనపెట్టి… మద్యం దుకాణాల తెరవడమే సమస్య అయినప్పుడు… అంత చిత్తశుద్ధి ఉంటే… ఒక్క లేఖ మోడీకి రాయోచ్చు కదా! ఎందుకయ్యా మద్యం దుకాణాల రీ ఓపెన్ కు అనుమతి ఇచ్చారు అని మోడీని ప్రశ్నించే దైర్యం చేయలేకపోయినా… ఇటు చంద్రబాబు అయినా, అటు బీజేపీ మిత్రుడు పవన్ అయినా… మోడీతో ఒక ప్రకటన.. “మద్యం దుకాణాలు తెరవకూడదు” అని ఇప్పిస్తే… ఒక్క రాష్ట్రంలో ఏమిటి… ఏకంగా దేశవ్యాప్తంగా కూడా వీరు మంచి చేసినవారు అవ్వడంతోపాటు… టీడీపీ జాతీయ పార్టీ అనే టైటిల్ కి జస్టిఫికేషన్ కూడా దొరికేది! కాని.. పరిష్కారాల దిశగా వీరు ఆలోచించడం లేదు..!

పైగా తన హయాంలో మద్యం ఎలా ఏరులై పారిందో చంద్రబాబుకి తెలియంది కాదు! ప్రజారోగ్యంపై ఆయనకు అంత శ్రద్ధ ఉండి ఉంటే… నాడు ఊరికో బెల్ట్ షాపు వెలిసేదీ కాదు. మద్యాన్ని నాడు చంద్రబాబు ఏ రేంజ్ లో నమ్ముకున్నారంటే… మద్యం లేకపోతే రాష్ట్రం తలకిందులైపోతుందంటూ గతంలో స్వయంగా ప్రకటనలు కూడా ఇచ్చినంత! అంతేనా… తన హయాంలో మూడు సార్లు మద్యం ధరల్ని పెంచారు కూడా! ఈ విషయాలు ప్రజలకు గుర్తుఉండవు అనుకుంటారో లేక… మరేమనుకుంటారో తెలియదు కానీ… ప్రస్తుతం ఇలా మాట్లాడుతున్నారు చంద్రబాబు!

ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే… జగన్ కు మద్యపాన నిషేధంపై చిత్తశుద్ధి ఉందని! దానికి… రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులు మూయించడం… వైన్ షాపుల్ని 30శాతం మేర తగ్గించే చర్యలు తీసుకోవడం… ప్రతీ వైన్ షాపు ముందు ఉండే ప్రైవేట్ రూమ్స్ ను పూర్తిగా నిర్మూలించడం… అందుకు సాక్ష్యాలుగా నిలవడం లేదా? ఇవి చంద్రబాబు – పవన్ చేస్తున్న లిక్కర్ పాలిటిక్స్ కి కౌంటర్స్ కాదా? ఏమో… జనాలకు తెలిసిన ఈ విషయాలు పవన్, చంద్రబాబులకు తెలియకపోవడం హాస్యాస్పదమే అంటున్నారు విశ్లేషకులు!

Read more RELATED
Recommended to you

Latest news