దిశ ఘటనలో దుర్మార్గులను ఉరి తీయాలి: చంద్రబాబునాయుడు

దిశ ఘటనలో మానవ మృగాలను ఉరితీయాలని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. కర్నూలులో టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, నాగరిక ప్రపంచం అసహ్యించుకునే విధంగా, ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేయడం ఎంత దారుణమని అన్నారు.

మృగాల కన్నా హీనంగా ప్రవర్తించారని, ఇలాంటి ఘటనలపై ప్రతిఒక్కరూ స్పందించాలని, తీవ్రంగా ఖండించాలని సూచించారు. ఇలాంటి దుర్మార్గులు ఈ గడ్డపై వుండడానికి వీలు లేదని, ఉరేస్తే తప్ప మిగిలినవాళ్లు భయపడరని అభిప్రాయపడ్డారు. మానవ మృగాలు సమాజంలో ఉండకుండా కట్టడి చేయాల్సిన అవసరం వుందని అన్నారు.