పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలం దొడ్డిపట్లలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వరద ముంచుకోస్తుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.గోదావరి వరద సమయంలో గండ్లు పడకుండా కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.గట్టు తెగుతుంటే సకాలంలో యువత చేసిన కృషి , దేవుడి దయతో మీరంతా సురక్షితంగా వున్నారనీ అన్నారు.
ప్రమాదం ముంచుకొచ్చినపుడు ప్రజలకు దగ్గరగా వుండాల్సిన ముఖ్యమంత్రి గాల్లో తిరుగుతున్నాడనీ మండిపడ్డారు. ఎన్నికలు వస్తుంటే మంత్రులను పంపుతారనీ.. వరదలు వస్తె ఎవ్వరినీ పంపరనీ అన్నారు.పేదవాడికి న్యాయం జరిగే వరకు టిడిపి పోరాటం కొనసాగుతోందనీ తెలియజేశారు. సొంత బాబాయ్ ని చంపి నా మీద పెట్టారనీ.. రఘు రామకృష్ణమ్ రాజుని చంపాలని చూసారనీ.. హత్య రాజకీయాలకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు.ముంపు ప్రాంతాల్లో కూడా త్వరలో పర్యటిస్తానని తెలియజేశారు.వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలు నాశనం అయ్యాయని అన్నారు.