కెసిఆర్ బాల్యమంతా దొంగతనాలతోనే గడిచింది – మధుయాష్కి గౌడ్

-

కెసిఆర్ బాల్యమంతా దొంగతనాలతోనే గడిచింది అన్నారు తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్.
కేసీఆరే ఇంజనీర్, డాక్టర్, మేధావి అని ఎద్దేవా చేశారు.కేసీఆర్ రాత్రి మెలకువగా ఉండి ఎవర్ని కుట్రలతో మోసం చేయాలనే ఆలోచిస్తాడనీ అన్నారు.కేసీఆర్ బాల్యమంతా దొంగతనాలతోనే గడిచిందన్నారు.తెలంగాణ రాకపోతే కేసీఆర్ ఇప్పటికీ మొండా మార్కెట్ లో రెంట్ కట్టకుండా వ్యాపారం చేసేవాడనీ అన్నారు.తన అవినీతి బద్దలైతదనే కేసీఆర్ వరంగల్ వెళ్ళాడనీ అన్నారు.కాళేశ్వరం ముంపు ముమ్మాటికీ మానవ తప్పిదమేనని మండిపడ్డారు.

రజత్ కుమార్ అనే వెధ‌వని అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేశారు.బాసర ఐఐఐటీ మెస్ కాంట్రాక్టర్ హరీష్ రావు బందువేనని ఆరోపించారు.ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోనే యూనివర్సిటీలు బాగుండేవని అన్నారు.వీడయ్య సొత్తా? వీడబ్బా సొత్తా? ఇదేమైనా రాచరికం అనుకుంటున్నాడా కేసీఆర్? అంటూ తీవ్రంగా మండిపడ్డారు.అవినీతి చేయకున్నా కాంగ్రెస్ నేతలపై ఈడీ నోటీసులు.. అవినీతి చేసిన కేసీఆర్ పై బీజేపీ ప్ర‌భుత్వం ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలన్నారు.కేసీఆర్ పై విచారణ చేయకపోతే ఆయన అవినీతిలో బీజేపీ కి భాగస్వామ్యం ఉందని అంగీక‌రించిన‌ట్లేనని అన్నారు.

సమైక్యాంధ్ర కంటే ఇప్పుడు దుర్భ‌ర‌ పరిస్థితులు తెలంగాణ‌లో నెల‌కొన్నాయనీ అన్నారు.మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ అని అన్నారు.కేసీఆర్ ఎవర్ని కలవకుండ ప్ర‌జాస్వామ్యంలో దొర‌స్వామ్యాన్ని చూపిస్తున్నాడనీ ఆగ్రహం వ్యక్తం చేశారు.పదవ తరగతి చదివిన వ్యక్తి విద్యాశాఖ మంత్రి అయ్యిందనీ ఎద్దేవా చేశారు.చదువురాని వాళ్ళకి ప్రయివేట్ యూనివర్సిటీలు ఇచ్చాడనీ మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news