బాపట్ల జిల్లా, ఉప్పాలవారిపాలెంలో దారుణ హత్యకు గురైన పదవ తరగతి బాలుడు అమర్నాథ్ గౌడ్ కుటుంబ సభ్యులను చంద్రబాబు నాయుడు పరామర్శించారు. అయితే.. బాలుడు అమర్నాథ్ కుటుంబానికి చంద్రబాబు ఆర్థికసాయం అందించారు.
రేపల్లె నియోజకవర్గం ఉప్పలవారిపాలెంలో అమర్నాథ్ అనే పదో తరగతి బాలుడు దారుణ హత్యకు గురికావడం రాష్ట్రంలో అందరినీ కలచివేసింది.
ఇవాళ ఉప్పలవారిపాలెం వచ్చిన చంద్రబాబు.. బాలుడు అమర్నాథ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి టీడీపీ తరఫున రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా, అమర్నాథ్ హత్య వివరాలను కుటుంబ సభ్యులు చంద్రబాబుకు వివరించారు.
చంద్రబాబు రాకతో అమర్నాథ్ కుటుంబ సభ్యులు భావోద్వేగాలకు లోనయ్యారు. వారు చెప్పిన వివరాలతో చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారి పరిస్థితి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పారు.