మనకి వుండే ముఖ్యమైన డాక్యుమెంట్స్ లో ఆధార్ కార్డ్ కూడా ఒకటి. ఆధార్ వలన చక్కటి లాభాలని పొందొచ్చు. ఏదైనా స్కీమ్ కోసం అయినా ఆధార్ కార్డు ఎంతో ముఖ్యం. ఆధార్ కార్డు చాలా వాటికి అవసరం. ఆధార్ కార్డు లో తప్పులు వుండకూడదు. ఆధార్ కార్డు లో ఏమైనా సమస్యలు ఉంటే వాటిని మనం పరిష్కరించవచ్చు. ఆధార్ లో వుండే తప్పులు మనం దిద్దుకోవచ్చు. ఒక్కోసారి ఆధార్ లో పేరు తప్పు పడుతుంది. మీ ఆధార్ లో కూడా పేరు తప్పుగా పడిందా..?
అక్షరాలు మిస్ కావడం, అదనంగా అక్షరాలు రావడం, పూర్తి పేరు లేకపోవడం ఇలా ఏమైనా సమస్య ఉంటే దాన్ని మీరు పరిష్కరించవచ్చు. మరి అది ఎలా అన్నది ఇప్పుడే చూద్దాం. ఇది వరకు కంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోవడంతో సులువుగా ఆధార్ వివరాలని మనం అప్‌డేట్ చేసేయచ్చు. ఆధార్ కార్డుపై తప్పుగా ఉన్న పేరును సరిచేసుకోవాలని అనుకుంటే ఇలా చేసేయండి.
దీని కోసం మొదట మీరు https://ssup.uidai.gov.in/ssup/ పోర్టల్ ని ఓపెన్ చేయండి.
ఆ తరవాత ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి.
ఇప్పుడు క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేయాలి.
రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
దాన్ని ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
ఇప్పుడు సర్వీసెస్ ట్యాబ్‌లో Update Aadhaar Online పైన క్లిక్ చేయాలి.
ఆ తరవాత మీరు Proceed to Update Aadhaar పైన క్లిక్ చేయాలి.
మీ పేరు స్క్రీన్ పైన వస్తుంది. ఎలా మీరు పేరు ని మార్చాలనుకుంటే ఆ పేరు ఎంటర్ చేయాలి.
అవసరమైన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. రూ.50 చెల్లించి ప్రాసెస్ పూర్తి చేసేయండి.