పోలీస్ జాబ్ వదిలేసి.. అడల్ట్ మోడల్ అయింది.. సంపాదన చూస్తే కళ్లు తిరగాల్సిందే..!

-

ఈ రోజుల్లో చాలామంది.. మంచి మంచి బాజ్స్ వదిలేసి.. వారి ఇష్టాలపై అడుగులు వేస్తున్నారు. పోలీస్ ఉద్యోగం వదిలేసి మరీ.. కొందరు డొమినాట్రిక్స్ వృత్తి ఎంచుకున్నారు. తాజాగా ఓ మహిళ పోలీస్ జాబ్ వదిలేసి.. అడల్ట్ మోడల్ అయింది. మంచి ఫేమ్, ఫాలోవర్స్ పెరిగారు. ఇప్పుడు ఆమె ఓ సెలబ్రెటీ అయిపోయింది. అసలు డబ్బు మాములాగా రాలేదు. ఈమె సక్సస్ ఫుల్ స్టోరీ వైపు మీరు ఓసారి లుక్కేయండి.!

విదేశాల్లో.. ఓన్లీఫాన్స్ అనే అడల్ట్ సైట్ భారీగా డబ్బు వచ్చేలా చేస్తోంది. ఆ డబ్బును చూసే మరింత మంది అటువైపు అడుగులు వేస్తున్నారు. ఇంగ్లండ్‌లోని ఎస్సెక్స్‌కి చెందిన చార్లొట్టే రోజ్ కూడా అలాంటిదే. 28 ఏళ్ల అమ్మాయి… ఒకప్పుడు పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు అడలల్డ్ మోడల్ అయింది.

2016లో 100 మంది అమ్మాయిలతో ఓన్లీ ఫాన్స్ ప్రారంభమైంది. అప్పట్లో దానికి పెద్దగా గుర్తింపు లేదు. కానీ రెండేళ్లలోనే ఆ సైట్ రకరకాల మోడల్స్‌తో వరల్డ్ ఫేమస్ అయింది. దాంతో చాలా మంది యువతులు స్కిన్ షో మోడలింగ్ వైపు అడుగులు వేశారు. చార్లొట్టే కూడా అదే చేసింది.

2018లో చార్లొట్టే ఓన్లీఫాన్స్‌లో జాయిన్ అయింది. పోలీస్ మోడల్ అని ఫ్యాన్స్ ఎగబడ్డారు. అంతే… విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇప్పటివరకూ రూ.12 కోట్లకు పైగానే వెనకేసింది. ప్రస్తుతం నెలకు రూ.కోటి 40 లక్షల దాకా సంపాదిస్తోందట. వామ్మో ఇంతనా అనిపిస్తుంది కదా..!

విలాసాలు..

భారీగా డబ్బు రావడంతో రూ.2.6 కోట్లు పెట్టి లంబోర్గినీ కారు కొనుక్కుంది. పోలీసుగా ఉన్నప్పుడు దీన్ని కొనుక్కోగలనా అనుకునేదట. నిజానికి చాలా మంది అడల్ట్ స్టార్లతో పోల్చితే చార్లొట్టే అతిగా అందాలు ఆరబోయదు. ఓవర్ ఎక్స్‌పోజింగ్ చేయదు. ఒకప్పుడు పోలీస్ కదా… అందువల్ల ఆమె రూల్స్ ఫాలో అవుతోంది. అయినప్పటికీ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం విపరీతంగానే ఉంది.

ప్రస్తుతం ఆమె రోజులో 14 నుంచి 16 గంటలు ఫ్యాన్స్‌కి అందుబాటులో ఉంటోంది. అందువల్లే ఆమెకు ఫాలోయింగ్ అలా ఉంది. పోలీస్ జాబ్ వదిలేయడంపై తాను ఏం బాధపడట్లేదని చార్లొట్టే తెలిపింది.

అందరికీ రాని అవకాశాలు..

చార్లొట్టే లాగా చాలా మంది ఓన్లీఫాన్స్‌లోకి వస్తున్నా… వాళ్లలో కొందరే భారీగా సంపాదిస్తున్నారు. చాలా మంది ఫెయిలవుతున్నారు కూడా. ప్రస్తుతం ఓన్లీఫాన్స్‌కి పోటీగా విదేశాల్లో చాలా సైట్లు వస్తున్నాయి.. ఈ సైట్లు అన్నీ.. వేర్వేరు ఉద్యోగాలు చేస్తున్న యువతుల్ని అడల్ట్ మోడలింగ్ వైపు లాగేసేందుకు యత్నిస్తున్నాయి. ఇందులో జాయిన్ అయ్యేవారికి డబ్బే మెయిన్ టార్గెట్..పేరెంట్స్ ఏమన్నారు, చుట్టాలు ఏమనుకుంటున్నారు ఇదంతా వారికి అనవసరం.. యురప్ దేశాలు, అమెరికాలో ఇలాంటి వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news