ఏపీలో మరో ఇండస్ట్రీ నుండి గ్యాస్ లీక్.. టెన్షన్ టెన్సన్ !

-

ఏపీలో ఎల్జీ పాలిమర్స్ సృష్టించిన గ్యాస్ లీక్ కలకలం అంతా ఇంతా కాదు. ఆ గ్యాస్ లీక్ దుర్ఘటనలో పది మందికి పైగా ప్రాణాలు కోల్పోగా చాలా మంది ఇప్పటికీ శ్వాస సంబందింత ఇబ్బందులతో బాధ పడుతున్నారు. ఈ ఘటన జరిగిన నాటి నుండి గ్యాస్ లీక్ అంటేనే భయపడిపోయే పరిస్థుతులు నెలకొన్నాయి. వివరాల్లోకి వెళ్తే తణుకు శివారు పైడిపర్రు వద్ద నున్న రసాయన కర్మాగారం నుంచి నిన్న అర్ధరాత్రి పెద్దఎత్తున దట్టమైన దట్టమైన పొగలు, ఘాటు వాయువులు వెలువడటం కలకలం రేపింది.

పైడిపర్రు వద్ద ప్లుటస్ రసాయన కర్మాగారం నుంచి ఆదివారం రాత్రి ఒక్కసారిగా ఘాటు వాయువులు వెలువడ్డాయి. ఈ హఠాత్తు పరిణామానికి ఉక్కిరి బిక్కిరి అయిన మండపాక, పైడిపర్రు, వెంకట్రాయపురం గ్రామాలకు చెందిన ప్రజలు ఏం జరుగుతుందో తెలియక ఆందోళనతో రోడ్లుపైకి చేరుకున్నారు ప్రజలు. ఆ కర్మాగారం ఎదుట బైఠాయించి యాజమాన్యాన్ని గ్రామస్తులు నిలదీశారు. అయితే వాల్వ్ లూజు కావడంతో కొంత గ్యాస్ లీకయినట్లు వెల్లడించిన సిబ్బంది, దాని వలన ఎలాంటి ప్రమాదం లేదని వెల్లడించారు. పరిస్థితిని సమీక్షించిన పోలీసులు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేరని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news