తెలంగాణ సచివాలయం నిర్మాణంలో విషయంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది.పాత సెక్రటేరియట్ భవనాలను కూల్చి వేసిన ప్రభుత్వం..ఆ స్థానంలో కొత్త సచివాలయ నిర్మాణానికి అడుగులు వేస్తోంది..ఇవాళ తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణానికి మరో అడుగు పడనుంది..ఇప్పటికే ప్రభుత్వం 500కోట్ల అంచనా వ్యయంతో సెక్రటేరియట్ నిర్మాణానికి టెండర్లు పిలిచిన ప్రభుత్వం ఈ రోజు ప్రైస్ బిడ్స్ తెరవనుంది.
సెక్రటేరియట్ నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్చర్స్ తయారు చేసిన నమూనాను కొన్ని మార్పులతో సీఎం ఖరారు చేసారు. ఆధునిక హంగులతో, నూతన సాంకేతిక పరిజ్ఞానం తో, పర్యావరణ హితంగా కొత్త సచివాలయం ఉండనుంది…కొత్త సచివాలయ నిర్మాణానికి గత నెల 18నుండి ఈ నెల 1వ తేదీ వరకు టెండర్లు స్వీకరించింది. ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు ఆర్ అండ్ బి కార్యాలయంలో ప్రైస్ బిడ్లు ఓపెన్ చేయనుంది రోడ్లు భవనాల శాఖ..టెండర్లు దక్కించుకున్న