చైనాలో లాంచ్‌ అయిన Realme 10 5G..ఫీచర్స్‌ ఇవే..!

-

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే రియల్‌మీ 10 5జీ. రియల్‌మీ 10 4జీ తర్వాతి వర్షన్‌గా ఇది విడుదలైంది.. గత వారమే ఈ ఫోన్‌ లాంచ్‌ చేశారు..ఇప్పుడు ఇందులో 5జీ వెర్షన్‌ను కంపెనీ అందుబాటులోకి తీసుకువచ్చింది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌ను అందించారు. దీంతోపాటు 90 హెర్ట్జ్ ఎల్సీడీ డిస్‌ప్లే కూడా ఉంది. ఇది ఒక మిడ్‌ రేంజ్‌ మొబైల్‌.. ఇంకా ఫోన్‌ ఫీచర్స్‌ ఎలా ఉన్నాయంటే..

రియల్‌మీ 10 5జీ ధర..

ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,299 యువాన్లుగా అంటే మనదేశ కరెన్సీలో సుమారు రూ.14,700గా ఉండగా, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 1,599 యువాన్లుగా అంటే సుమారు రూ.18,100గా నిర్ణయించారు.

రియల్‌మీ 10 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

ఇందులో 6.6 అంగుళాల పుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080 × 2400 పిక్సెల్స్ కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది.
ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే… ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, ఏఐ లెన్స్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో రూ.15 వేలలోపు ఉన్న రెడ్‌మీ, షావోమీ, శాంసంగ్ 5 జీ ఫోన్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version