భారీ స్కోర్ దిశగా చెన్నై .. RCB కి చుక్కలు చూపిస్తున్న కింగ్స్ !

-

బెంగుళూరు లోని చిన్నస్వామి స్టేడియం లో చెన్నై మరియు బెంగుళూరు జట్ల మధ్యన హోరాహోరీ మ్యాచ్ జరుగుతోంది. మొదట టాస్ గెలిచిన బెంగుళూరు కెప్టెన్ డుప్లెసిస్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు, బ్యాటింగ్ చేపట్టిన చెన్నై మొదట్లోనే గైక్వాడ్ వికెట్ ను కోల్పోయింది. కానీ ఆ తర్వాత రహానే మరియు కాన్ వే లు రెండవ వికెట్ కు 74 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి చెన్నై కు గట్టి పునాది వేశారు. వేగంగా ఆడే క్రమంలో రహానే (37) అవుట్ కాగా , కాన్ వే మరియు దుబే లు మరో వికెట్ పడకుండా స్కోర్ బోర్డు ను పడిపోకుండా జాగ్రత్త పడుతున్నారు. వీరిద్దరూ బెంగళూరు బౌలర్లను ఒక ఆటాడుకుంటున్నారు.. పడిన బంతిని పడినట్లే బౌండరీలకు తరలిస్తూ భారీ స్కోర్ దిశగా దూసుకు వెళుతున్నారు.

కాగా కాన్ వే (83) ఇప్పటికే అర్ద సెంచరీని పూర్తి చేసుకుని చెన్నైకు గట్టి టార్గెట్ ను అందించడానికి చూస్తున్నారు. ప్రస్తుతం చెన్నై 15 ఓవర్ లలో 165 పరుగులు చేసి భారీ స్కోర్ కు బలమైన పునాదులు వేసుకుంది.

Read more RELATED
Recommended to you

Latest news