ధోని కుంటడం చూసి ఫ్యాన్స్ విచారం… వీడియో వైరల్

-

మహేంద్ర సింగ్ ధోని కుంటడం చూసి ఆయన ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్లితే…సీఎస్‌కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మోకాలి గాయంతో బాధపడుతున్నాడంటూ టీం హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ గతవారం చేసిన ప్రకటన అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఇలాంటి టైంలో ధోనీ కుంటుతూ బస్ ఎక్కుతున్న వీడియో వైరల్ అవుతూ అభిమానుల్లో టెన్షన్ మరింత పెంచేసింది. ఐపీఎల్‌లో ధోని భవితవ్యంపై అనిశ్చితి నెలకొన్న పరిస్థితుల్లో ఈ వీడియో ధోనీ ఫ్యాన్స్‌లో నిరాశ నింపింది.

Ms Dhoni Injury:महेंद्र सिंह धोनी चोट से परेशान, रांची के जंगलों में महज 40 रुपये में करा रहे इलाज - Ms Dhoni Injury Mahendra Singh Dhoni Knee Pain Due To Calcium Deficiency

‘‘వికెట్ల మధ్య మెరుపులా దూసుకుపోయే ధోనిని ఇలా చూస్తుంటే విచారం కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ధోనీ టీం కోసం తాను చేయగలిగినదంతా చేస్తూ స్ఫూర్తివంతంగా నిలుస్తున్నాడు’’ అని కొందరు కామెంట్ చేశారు. మహీ ఆరోగ్యం గురించి పూర్తి వివరాలు కావాలని మరికొందరు ట్విట్టర్ వేదికగా కోరారు. ‘‘ఈ సీజన్ మహీకి చివరిదిలా కనిపిస్తోంది. అభిమానులను నిరాశ పరచొద్దనే ఉద్దేశంతో ధోని ప్రతి మ్యాచ్ ఆడుతున్నట్టుగా ఉంది’’ అన్న కామెంట్స్ కూడా వచ్చాయి. గాయం బాధిస్తున్నా ఫ్యాన్స్ కోసం ప్రతి మ్యాచ్ ఆడుతున్నాడని ప్రశంసల వర్షం గుప్పిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news