గత రెండు నెలల నుండి తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం అయితే అందరికీ గుర్తుకు వచ్చే చికెన్ ధరలు కేజీ రూ. 300 కు పైగానే పలికింది. ముఖ్యంగా మే మరియు జూన్ నెలల్లో అయితే ఒక కేజీ చికెన్ ధర రూ. 350 కు చేరుకుంది. దీనితో చాలా మంది సామాన్య కుటుంబాలు చికెన్ ను తినడమే మానేశారు. ఎండాకాలంలో మాములుగా వేడి వలన మనుషులే తట్టుకోలేరు, అలాంటిది కోళ్లు మాత్రమే ఎలా తట్టుకుంటాయి,.. దానితో మరణాలు పెరిగే కొద్దీ చికెన్ మాంసం ధరను వ్యాపారస్తులు పెంచేశారు. ఇప్పుడు చికెన్ ధరలు కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తున్నట్లు తెలుస్తోంది. కోళ్లు ఎక్కువగా దొరుకుతుండడంతో చికెన్ ధరలు కూడా సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఒక కేజీ చికెన్ ధర రూ. 220 నుండి 250 ఉంది. రానున్న రోజుల్లో దీని ధర ఇంకా తగ్గే అవకాశం ఉందని కోళ్ల సంస్థల యజమానులు తెలియచేస్తున్నారు.
ఇది నిజంగా గుడ్ న్యూస్ అని చెప్పాలి, ఎలాగు రేపు ఆదివారం కాబట్టి ప్రతి ఒక్కరూ చికెన్ ను తీసుకోవడానికి ఆసక్తిని కనబరుస్తారు.