ఈడి ముందు హాజరైన చికోటి ప్రవీణ్

-

క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రధారి చికోటి ప్రవీణ్‌ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సోదాలు ముగిశాయి. విచారణకు రావాల్సిందిగా ఈడీ అధికారులు వారికి నోటీసులు ఇచ్చారు. ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. 10 మంది సినీ తారలను నేపాల్‌కు రప్పించినట్లు.. అంతకుముందు వారితో చికోటి ప్రవీణ్‌ ప్రమోషన్ వీడియోలు చేయించినట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో సోమవారం ఈడి అధికారుల ముందు హాజరయ్యారు ప్రవీణ్. క్యాసినో వ్యవహారంతో పాటు హవాలా రూపంలో నగదు బదిలీలపై చీకోటి ప్రవీణ్ ను విచారిస్తున్నారు ఈడి అధికారులు. అలాగే సంపత్, మాధవరెడ్డి, బబ్లు, రాకేష్, వెంకట్ లను ఈడి అధికారులు విచారిస్తున్నారు. సినీ, రాజకీయ నేతలతో చీకోటి ప్రవీణ్ కు ఉన్న సంబంధాలపై ఆరాధిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news