ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరగాలన్నారు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు. సి- సెక్షన్లు తగ్గించి, సాధారణ ప్రసవాలన్ ప్రోత్సహించాలని సూచించారు. పీహెచ్‌సీల్లో ఓపీ మరింత పెరగాలన్నారు. వైద్యులు 9 గంటల నుండి 4 గంటల వరకు విధుల్లో ఉండాలని సూచించారు. ఏఎన్‌సీ చెకప్స్, వివరాల నమోదు తప్పకుండా చేయాలన్నారు. పీహెచ్‌సీలు, సబ్ సెంటర్ల కొత్త నిర్మాణాలు, మరమ్మతులు వేగవంతం చేయాలన్నారు.
పీహెచ్‌సీల్లో ఇంటర్నెట్ సదుపాయం, కెమెరాల ఏర్పాటు త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. టీబీ పేషెంట్లకు అండగా ఉండే నిక్షయ్ మిత్ర చొరవలో దాతలను భాగం చేయాలన్నారు. జిల్లా వైద్యాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనితీరు మెరుగు పడేలా చూడాలని చెప్పారు మంత్రి హరీష్ రావు. పీహెచ్‌సీలు, ఆశా, ఏఎన్ఎంలతో నెలవారీ సమీక్షలో పాల్గొన్న ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వారికి ఈ విధంగా సూచించారు.