పిల్లల కోసం LIC పాలసీ… వివరాలు ఇవే…!

-

మీరు పిల్లల కోసం ఏదైనా పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే LIC న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీని తీసుకోవచ్చు. దీని వలన మంచి బెనిఫిట్స్ కలుగుతాయి. ఈ పాలసీని పిల్లల భవిష్యత్తును దృష్టి లో పెట్టుకొని రూపొందించింది ఎల్ఐసీ. చదువు, పెళ్లిళ్లు, ఇతర అవసరాలకి ఇది బాగా ఉపయోగ పడుతుంది. పిల్లలు పుట్టిన వెంటనే ఈ పాలసీ తీసుకోవచ్చు.

కనీసం రూ.1,00,000 సమ్ ఇన్స్యూర్డ్‌తో ఈ పాలసీని తీసుకోవచ్చు. ఎల్ఐసీ న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీ తీసుకోవడానికి కనీస వయస్సు 0 ఏళ్లు. గరిష్ట వయస్సు 12 ఏళ్లు. మెచ్యూరిటీ వయస్సు 25 ఏళ్లు. పిల్లలకు 25 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పాలసీ గడువు ఉంటుంది.

ఇది నాన్ లింక్డ్, పార్టిసిపేటింగ్, ఇండివిజ్యువల్, లైఫ్ ఇన్స్యూరెన్స్, సేవింగ్స్ ప్లాన్. ఈ పాలసీని పిల్లల తల్లిదండ్రులు లేదా అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలు పిల్లల పేరు పై తీసుకోవచ్చు. ఉదాహరణకి రూ.1,00,000 సమ్ అష్యూర్డ్ ‌తో 0 ఏళ్లు ఉన్న పిల్లలకు రూ.4327 ప్రీమియం చెల్లించాలి. అయితే 5 ఏళ్లు ఉన్న పిల్లలకు రూ.5586 ప్రీమియం, 10 ఏళ్లు ఉన్న పిల్లలకు రూ.7899 ప్రీమియం, 15 ఏళ్లు ఉన్న పిల్లలకు రూ.9202 ప్రీమియం చెల్లించాలి అంతే.

ప్రీమియంను ఏడాది, ఆరు నెలలకోసారి, మూడు నెలలకోసారి లేదా నెలకి ఒకసారి కూడా చెల్లించచ్చు. ఇది ఇలా ఉంటే సమ్ అష్యూర్డ్ కనీసం రూ.1,00,000. గరిష్ట పరిమితి లేదు. అయితే ఈ పాలసీ తీసుకున్న పిల్లలకు వారి వయస్సు 18, 20, 22 ఏళ్లు ఉన్నప్పుడు 20 శాతం చొప్పున మనీ బ్యాక్ వస్తుంది.

న్యూ చిల్డ్రన్ మనీ బ్యాక్ పాలసీకి ఫ్రీ లుక్ పీరియడ్ ఉంటుంది. అయితే దీని వలన బెనిఫిట్స్ ఏమిటంటే పాలసీ తీసుకున్న తర్వాత నచ్చకపోతే 15 రోజుల్లో వెనక్కి ఇచ్చి ప్రీమియం తీసుకోవచ్చు. అలానే రుణ సదుపాయం కూడా ఉంది. ప్రీమియం పేమెంట్ ఆలస్యం అయితే 15 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news