కరోనాకి వ్యాక్సిన్ ఇంకా కనుక్కోబడలేదు. అందువల్ల దీని బారి నుండి ప్రాణాల్ని రక్షించుకోవడానికి మాస్క్ ఒక్కటే సరైన నివారణ అని సెలెబ్రిటీల నుండి రాజకీయ నాయకుల వరకు చెబుతూనే ఉన్నారు. ఐతే అందరూ మాస్క్ ధరిస్తున్నారా అంటే అనుమానమే. మాస్క్ ధరించకపోతే జరిమానా విధిస్తామని చెప్పినా కూడా ఎవరూ వినడం లేదు. ఆఖరికి మాస్క్ ఎందుకు పెట్టుకోవాలని నిరసన ప్రదర్శించినవాళ్ళు కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే, మాస్క్ పెట్టుకోకపోతే దేశ అధ్యక్షుడిని కూడా వదిలి పెట్టని దేశం గురించి చెప్పుకోవాలి. చిలీ దేశ ప్రెసిడెంట్ సెబాస్టియన్ పినెరాకి మాస్క్ పెట్టుకోనందున 2లక్షల 57వేల జరిమానా విధించారు. ఇటీవల ఒక పబ్లిక్ మీటింగ్ కి వెళ్ళినపుడు అక్కడ ఓ అభిమానితో సెల్ఫీ దిగిన ప్రెసిడెంట్ మాస్క్ పెట్టుకోకుండా కనబడ్డాడు. దాంతో భారీ జరిమానా విధించింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు ఆ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పారు.