ఆ దేశంలో వింత ఆచారం.. దెయ్యాలకు పెళ్ళి…ఆన్‌లైన్ లో ఆత్మల బిజినెస్..!

-

టెక్నాలజీ ఇంత అప్డేట్ అయినా..మనుషులు మారుతున్నాకానీ…ఇంకా కొని ప్రదేశాల్లో వింత ఆచారాలు, మూఢనమ్మకాలు తారసపడుతూనే ఉన్నాయి. మన పూర్వీకులు చేశారు, మనం చేయాలి అనే ధోరణిలోనే అక్కడి మనుషులు ఉంటున్నారు. ఇప్పటికే కొన్ని వింతఆచరాల గురించి మనం చెప్పుకున్నాం. ఇది వాటిన్నంటికి కన్నా కాస్స భిన్నమైనదే.. దెయ్యం అంటే కొందరు నమ్ముతారు..మరికొందరు భయపడతారు..ఇంకొందరు నమ్మిస్తారు. దెయ్యాలు ఉన్నాయో లేవు అని ఇంకా కొందరు వాదిస్తారు. కానీ చైనాలో అయితే ఏకంగా దెయ్యంతోనే పెళ్లిచేస్తారు. అసలు ఆ పెళ్లికి దెయ్యం ఎలా వస్తుందో.ఇదేం సంప్రదాయమో చూద్దాం.

మీరు ఇదే వినే ఉంటారుగా..పెళ్లి కాని అమ్మాయిలు ఆత్మహత్యలు చేసుకుంటే..వాళ్లు ప్రేతాత్మలుగా తిరుగుతారని మనం కొన్ని సినిమాల్లో కూడా చూసే ఉంటాం. అలానే చైనాలో సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఓ యువతి పెళ్లికాకుండానే ఆత్మహత్య చేసుుకుంది.
కోపంతో రగిలిపోతున్న ఆత్మలకు పెళ్లి చేయడం ద్వారా శాంతిస్తాయన్నది వారి నమ్మకం. ఇందుకోసం వాళ్లు పెళ్లి కాకుండా చనిపోయిన రెండు ఆత్మల అస్థికలు తీసుకొని… వాటితో ఏవో మంత్రపూజలు చేసి… పెళ్లి జరిపిస్తారుట. వినటానికి కొంచె వెరైటీగా ఉన్నా ఇది నిజం అండీ..!

ఆత్మహత్య చేసుకున్న ఈ యువతి ఆమె చనిపోయే కొన్ని రోజుల ముందు నుంచి సోషల్‌ మీడియాలో విషాదకర మాటలు మాట్లాడుతూ… అలాంటి పోస్టులే పెట్టిందట. చనిపోయే ముందు రోజు పెట్టిన వీడియోలో కూడా అదే తన చివరి వీడియో కావచ్చు అని తెలిపింది. అక్టోబర్ 15న ఆమె ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసులు అందిస్తుండగా చనిపోయినట్లు చైనా మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. లక్షల మంది అభిమానులు ఉండీ.. ఆమె సూసైడ్ చేసుకోవడం ఏంటో ఎవరికీ అర్ధంకాలేదు. సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరిపారు. ఐతే… స్మశానంలో పనిచేసే ఓ వ్యక్తి… ఆమె అస్థికలను దొంగిలించి.. ఎవరికో అమ్మేశాడట. వాళ్లు వాటి ద్వారా దెయ్యం పెళ్లి చెయ్యించాలని డిసైడైనట్లు తెలిసింది. ఈ విషయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

అయితే చైనాలో ఈ ఆచారం 3వేల సంవత్సరాలుగా కొనసాగుతోందట. అయితే ఇలాంటి పెళ్లిళ్లను చనిపోయిన వారి తల్లిదండ్రులు జరిపిస్తుంటారు. వారే చనిపోయిన వారికి జోడీ ఆత్మను కూడా వెతుకుతారు. ఆ తర్వాత తంతును మంత్రగాళ్లు చేస్తారు. అయితే ఈ ఆచారాన్ని చైనా కొన్ని దశాబ్దాలకు పూర్వమే నిషేధించింది.అలవాటు పడినా జనాలు..వారి నమ్మకాలు వారికి ఉంటాయిగా…ఇది రహస్యంగా కొనసాగుతోంది. ఇప్పుడైతే ఏకంగా ఇది ఆన్‌లైన్‌ బిజినెస్‌గా మారిపోయింది. ఇప్పుడు ఆన్‌లైన్‌లో జోడీ ఆత్మకి సంబంధించిన అస్థికలను కూడా అమ్మేస్తున్నారని తెలిసింది. చైనా అమ్మాయి అస్థికల్ని దొంగిలించాక… వాటిని అమ్మడానికి ప్రయత్నిస్తున్న ఆ ముగ్గురు కేటుగాళ్లనూ పోలీసులు అరెస్టు చేశారు. అలా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

శవాల అస్తికలతో బిజినెస్ ఏంట్రా..అసలు ఈ చైనావాళ్లకు ఇలాంటి వెరైటీ థాట్స్ ఎందుకు వస్తాయో..ఎందులో అయనా భిన్నంగా ఉండటంలో వీళ్లకు సాటి ఎవరూ ఉండరంటూ..ఈ విషయం తెలిసిన నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. మొత్తానికి దెయ్యాలతో అయితే పెళ్లిళ్లు చేస్తున్నారనమాట.!

Read more RELATED
Recommended to you

Latest news