ఉనికి కోసమే బీజేపీ ఆరాటం- జగ్గారెడ్డి

-

రాష్ట్రంలో బీజేపీ ఉనికి కోసం ఆరాట పడుతుందని.. కేవలం ఉనికి కోసమే ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. బీజేజీ, టీఆర్ఎస్ పార్టీలు కేవలం రాజకీయం కోసం తప్పితే రైతుల కోసం కొట్లాడటం లేదని విమర్శించారు. టీఆర్ఎస్, బీజేపీలు ఇక వరి డ్రామాలు ఆపాలన్నారు. వరి ధాన్యం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని.. వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడం వల్ల రెండు నెలలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. రైతులంతా రాత్రిళ్లు వరి కుప్పలదగ్గరే పడుకుంటున్నారని పేర్కొన్నారు. 60 శాతం ధాన్యం ఇంకా రోడ్లమీదనే ఉందన్నారు. వరి కల్లాల్లో ఉన్న ధాన్యం మొలకెత్తి రైతులకు నష్టపోతున్నారని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద టీఆర్ఎస్ అనుకూలంగా ఉండే రైతులకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు.

jaggareddy | జగ్గారెడ్డి

బండి సంజయ్ మాటలకు కేసీఆర్ స్పందించడం వల్ల రైతులకు ఏ ప్రయోజనం ఉండదన్నారు. యాసంగి ధాన్యం సంగతి తరువాత, ముందు వానాకాలం పంటను కొనుగోలు చేయాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. అవసరం లేకున్నా.. యుద్ధవిమానాలు కొంటున్నారు.. రైతుల ధాన్యం కొనుగోలు చేయరా..అని కేంద్రాన్ని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news