చైనా మనని మోసం చేసిందా…

-

కరోనా వైరస్ కి ఇప్పుడు పరిక్షలు ఎక్కువగా జరగాల్సిన అవసరం ఉంది. లక్షల్లో పరిక్షలు జరిగితే బాధితులు ఎంత వేగంగా బయటకు వస్తే మనకు అంత మంచిది. వాళ్ళను చికిత్స తరలించడం సహా కొన్ని కార్యక్రమాలతో కరోనా వైరస్ ని పూర్తి స్థాయిలో కట్టడి చేసే అవకాశం అనేది ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో పది లక్షల మందికి కేవలం వంద పరిక్షలు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో పరిక్షలు అనేవి లేవు.

దీనికి సరిపడా పరికరాలు మన వద్ద లేవు అనేది వాస్తవం. ఈ నేపధ్యంలోనే మన దేశం చైనాకు భారీగా ఆర్డర్లు ఇచ్చిందని అయినా సరే చైనా మనకు టెస్ట్ చేసే కిట్స్ ఇవ్వడం లేదు అనేది కొందరి వాదన. చైనాకు మన దేశం దాదాపు 15 లక్షల కిట్స్ ఆర్దర్ ఇచ్చిందని అవి ఈ నెలలో రావాల్సి ఉందని కాని మనకు ఇవ్వాల్సిన కిట్స్ ని చైనా ఫ్రాన్స్, ఇటలీ దేశాలకు పంపింది అంటున్నారు.

యూరప్ దేశాలకు దగ్గర కావాలి అని భావించిన చైనా మనకు ఇవ్వాల్సిన కిట్స్ ని వాళ్లకు ఇచ్చింది. ఇక రాష్ట్రాలు కూడా ఆర్డర్ చేసినా సరే చైనా మాత్రం ఇవ్వడానికి ముందుకు రావడం లేదని… కొంత చెల్లింపులు కూడా జరిగాయని సమాచారం. దీనికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని… చైనా మాత్రం ఈ విషయంలో మనల్ని మోసం చేసింది అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. అందుకే చైనా ఉత్పత్తులను బాన్ చెయ్యాలి అని కోరుతున్నారు పలువురు.

Read more RELATED
Recommended to you

Latest news