ఢిల్లీకి చేరుకున్న చైనా ప్రధాని లీ కియాంగ్

-

జీ-20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సుకు సర్వం సిద్ధమైంది. ఇందుకోసం పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధుల రాక ఢిల్లీలో ఇప్పటికే సందడి మొదలైంది. ఈ నెల 9, 10 తేదీల్లో న్యూఢిల్లీలో జీ20 సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ప్రపంచంలోని పలు దేశాధినేతలు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో 40 మంది ప్రపంచ చేశాలకు చెందిన ప్రతినిధులు, ఆయా దేశాల అధినేతలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ సమావేశానికి కేంద్ర ప్రభుత్వం విస్తృతంగా ఏర్పాట్లు చేసింది. అయితే.. పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ప్రధాని లీ కియాంగ్ G-20 సమ్మిట్ కోసం ఢిల్లీకి చేరుకున్నారు.

G20 Summit Delhi LIVE Updates: Chinese Premier Li Qiang arrives in Delhi

ఆయనకు కేంద్ర మంత్రి వీకే సింగ్ స్వాగతం పలికారు. అంతకుముందు జీ-20 సదస్సు కోసం ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా ఢిల్లీ చేరుకున్నారు. అయితే.. ఢిల్లీలో జీ-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఈ ద్వైపాక్షిక చర్చలో కీలక అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. భారత్‌లో జెట్ ఇంజిన్‌లను సంయుక్తంగా తయారు చేసే ఒప్పందంపై పురోగతి, MQ-9B సాయుధ డ్రోన్‌ల కొనుగోలు, పౌర అణు బాధ్యత, వాణిజ్యంపై ఒప్పందం లాంటి అంశాలపై ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిపినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news