వైఎస్ జగన్, వైఎస్సార్‌లపై త్రిదండి చినజీయర్ స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. సమతామూర్తి రామానుజాచార్యుల విగ్రహ సందర్శనకు సమాజంలో అన్ని వర్గాలకు మంచి జరగాలని కోరుకున్న వారిని ఆహ్వానించామని.. సమానత్వం పట్ల ఉన్న దృఢ సంకల్పంతో వైఎస్ జగన్ రావడం సంతోషకరమని.. పేర్కొన్నారు త్రిదండి చినజీయర్ స్వామి.
ఏపీలోని అన్ని వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న వైఎస్ జగన్ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయానన్నారు. ఏ పాలకుడికైనా ఉండాల్సింది అన్ని వర్గాల ప్రజలను, వారి ప్రయోజనాలను సమానంగా చూడటమేనని… వైఎస్ జగన్, వైఎస్సార్‌ల ఆలోచన ఇదేనని పేర్కొన్నారు. వారు అన్ని వర్గాల వారి హక్కులను కాపాడుతూ, వారి సంక్షేమానికి పాటుపడాలని భావించారని త్రిదండి చినజీయర్ స్వామి స్పష్టం చేశారు.
యువకుడు వైఎస్ జగన్ ధర్మ పరిరక్షణకు, సమాజంలో సమానత కోసం ఏం కావాలో తెలుసుకొని దాని కోసం కృషి చేస్తున్న వ్యక్తి అని పేర్కొన్నారు. విద్య, ధనం, వయసు, అధికారం కలిగి ఉన్న వారు ఇతరుల సలహాలు తీసుకోరని… కానీ జగన్‌కు ఈ నాలుగు ఉన్నప్పటికీ ఎలాంటి గర్వం లేదని చెప్పారు. పెద్దల మాటను గౌరవిస్తారు. వారి సూచనలు, సలహాలను స్వీకరిస్తారు.. పాటిస్తారు. జగన్ మరింత ఉన్నత స్థానానికి ఎదిగి ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నానని చెప్పారు చినజీయర్ స్వామి.