మరోసారి వాయిదా పడ్డ టాలీవుడ్ ప్రముఖుల భేటీ…

-

టికెట్ ధరలు, ఆన్ లైన్ టికెట్ విధానంలో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ సమస్యలపై చర్చించేందుకు టాలీవుడ్ ప్రముఖులు భేటీ కావాాలిని నిర్ణయించారు. మరోసారి టాలీవుడ్ ప్రముఖుల భేటీ వాయిదా పడింది. అయితే సోమవారం సమావేశం కావాల్సిఉన్నా  అది వాయిదా పడింది. మంగళవారం భేటీ అవ్వాలని అనుకున్నప్పటికీ… మరోసారి ఈ సమావేశం వాయిదా పడింది. కొందరు సినీ ప్రముఖులు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ముందుగా అనుకున్న ప్రకారం ఈరోజు మీటింగ్ జరిగితే చిరంజీవి కూడా హాజరు కావాలని అనుకున్నారు.

అయితే ఈ టాలీవుడ్ లో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ అనంతరం మరోసారి మెగాస్టార్ చిరంజీవి మరోసారి ఏపీ సీఎం జగన్ తో సమావేశం కానున్నారు. ఈనెల 10 తేదీన జగన్ తో మెగాస్టార్ భేటీ జరుగనుంది. గతంలో ఒకసారి ఒంటరిగానే చిరంజీవి, సీఎం జగన్ తో సమావేశమయ్యారు. అయితే ఈసారి ఇండస్ట్రీ ప్రముఖులతో కలిసి సీఎం జగన్ ని కలువనున్నట్లు సమాచారం. కాగా సీఎంతో చర్చించే సమయంలో ఏఏ అంశాలను ఆయన ముందుకు తీసుకెళ్ధామనే అంశాలపై ముందుగానే చర్చించేందుకు టాలీవుడ్ ప్రముఖులు సమావేశం కావాలని నిర్ణయించారు. కాగా ఈ సమావేశం మరోసారి వాయిదా పడింది.

Read more RELATED
Recommended to you

Latest news