సంజయ్ భాయ్.. నువ్వు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: చిరంజీవి

-

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్‌ కాన్సర్ బారిన పడటంపై టాలీవుడ్ అగ్రహీరో చిరంజీవి స్పందించారు. ‘అత్యంత ప్రియమైన సంజయ్ భాయ్.. నువ్వింతటి తీవ్రమైన అనారోగ్య పరిస్థితులతో పోరాడుతున్నావని తెలిసి ఎంతో బాధగా ఉంది. కానీ నువ్వో ఫైటర్ వి. ఎన్నో ఏళ్లుగా అనేక సంక్షోభాలను అధిగమించావు. ఎలాంటి సందేహం లేదు, దీన్నుంచి కూడా నువ్వు తప్పకుండా బయటికి వస్తావు. నువ్వు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

కాగా, శ్వాస సంబంధమైన సమస్యతో సంజయ్ ఆస్పత్రిలో చేరగా డాక్టర్ లు అన్ని రకాల టెస్టులను చేసారు. అయితే ఆయన ఊపిరితిత్తుల కాన్సర్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో మెరుగైన చికిత్స కోసం అమెరికాకు పయనమైనట్టు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో తన ట్విట్టర్ వేదికగా సంజయ్ దత్‌ స్పందించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news