ఏపీలో ఈరోజుకు ఎంతో ప్రాధాన్యత రోజుగా ఏపీ ప్రజలు భావించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవిలు భేటి కాబోతున్నారు అనే వార్త ఇప్పుడు ఏపీతో పాటు తెలంగాణ, కేంద్రంలోనూ పెద్ద చర్చనీయాంశం అయింది. తాడేపల్లిలోని ఏపీ సీఎం నివాసంలో ఈ భేటి జరుతుందని అంతా అనుకున్నారు.. కానీ ఈ భేటి వాయిదా పడినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం ఇవాళ అమరావతిలో ఉదయం 11 గంటలకు సీఎం జగన్‌తో చిరంజీవి, రాంచరణ్ భేటీ అవనున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఈ సమావేశం కొన్ని కారణాలతో ఈ నెల 14వ తేదీకి వాయిదా పడింది. మెగాస్టార్‌కు సీఎం వైఎస్ జగన్ అపాయింట్మెంట్ 14వ తేదీన ఖరారైందట.
కేంద్రమాజీ మంత్రి, మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సైరా చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డిలు వైఎస్ జగన్‌ను కలిసేందుకు ముందుగా షెడ్యూల్ ఖరారు అయింది. సైరా చిత్ర యూనిట్ సీఎం జగన్‌ను కలిసేందుకు సీఎం జగన్ అపాయింట్‌మెంట్ మెగాస్టార్ చిరంజీవి కోరడం, సీఎం జగన్ అపాయింట్‌మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ భేటీపై పొలిటికల్ సర్కిల్‌లో ఆసక్తికరమైన చర్చ సాగుతున్నాయి.
ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని మెగాస్టార్ టీం అంటున్నారు. సైరా మూవీని చూడాల్సిందిగా సీఎం జగన్‌ను మెగాస్టార్ ఆహ్వానించేందుకు మెగాస్టార్, నిర్మాత, దర్శకుడు వెళుతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ఏమో తెలియదు కానీ మెగాస్టార్, జగన్ ల భేటీ ఈనెల 14కు వాయిదా పడిందని మాత్రం ప్రచారం జరుగుతుంది.
మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం. సొంతంగా ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఉమ్మడి ఏపీలో పోటి చేశారు. ఆనాడు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తో సన్నిహితంగా ఉండేవారు. తరువాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం, మెగాస్టార్ రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కావడం, తరువాత కేంద్రంలో మంత్రిగా ఎంపిక కావడం జరిగిపోయాయి. అయితే కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో ఓడిపోవడంతో మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలకు విరామం ప్రకటించి, సినిమాలకే పరిమితమయ్యారు.
అయితే మెగాస్టార్ సినిమాల్లోకి వెళ్లినా ఆయన శిష్యులు అనేకమంది వివిధ పార్టీలో ఉండి చక్రం తిప్పుతున్నారు. అయితే మెగాస్టార్‌కు ఉన్న ఇమేజ్‌ను తనకు అనుకూలంగా మార్చుకోవాలని కూడా ఏపీ సీఎం జగన్ ఆలోచనగా ఉందట. అందుకే సైరా చిత్రానికి జగన్ ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడమే కాకుండా మెగాస్టార్‌కు ప్రాధాన్యత కూడా ఇస్తున్నారు. అయితే ఇప్పుడు మెగాస్టార్ అపాయింట్‌మెంట్ కోరగానే వెంటనే సీఎం జగన్ ఇవ్వడం, ఇద్దరు భేటీ అయ్యెలోపే అది వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పుడు మెగాస్టార్, జగన్ భేటీ కోసం అందరు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.