ప్రజల కోసమే పార్టీ.. నేతల కోసం కాదు.. ప్రజా సంక్షేమమే ఎజెండా.. నేతల పంచాయితీలు తీర్చడానికి కాదు.. ప్రజల అభివృద్ధి ముఖ్యం.. ప్రజాప్రతినిధుల జేబులు నింపేందుకు కాదు.. ఇచ్చిన మాట కోసం ఎందాకైనా వెళుతా.. చేసిన ప్రమాణం తీర్చేందుకు ఏమైనా చేస్తా.. విశ్వసనీయతకు పెద్ద పీట వేస్తా.. కాదు కూడదు.. అని ఎవరైనా తోకజాడిస్తే.. తోక కత్తిరిస్తా అంటున్నారు ఏపీ సీఎం జగన్. ప్రతిపక్ష నేతగా నేను అధికార పక్షం చేస్తున్న ఆగడాలను చూసా.. పేద ప్రజలను అధికార పార్టీ నేతలు, అధికారులు ఎలా పీల్చి పిప్పి చేసారో చూసా.. ప్రతిపక్ష పార్టీగా అధికార పార్టీపై ప్రజా సమస్యల కోసం ఎలా పోరాడాలో తెలిసినోడిని.. మనం అధికారంలోకి వస్తే ఇవన్ని రాకుండా చూసుకోవాలనుకున్న కానీ మీరు ఇలా చేస్తే మనకు.. గతంలో అధికారంలో ఉన్న పార్టీకి తేడా ఏంటి అని ఆయన ఫైర్ అయ్యారు.
ప్రజలు మనల్ని చూసి ఏమంటారు.. మళ్ళృ ఏ మొహం పెట్టుకుని ఓట్ల కోసం ప్రజల వద్దకు పోతాం.. ప్రజాభిమానం ఉన్నంత వరకే మనకు పదవులు.. ప్రజలు చీత్కరించారో.. ఇప్పటి ప్రతిపక్షానికి పట్టిన గతే మనకు పడుతుంది.. ఎందరో రాజకీయ ఉద్దండులు ప్రజా వ్యతిరేకతకు కొట్టుకుపోయారు.. మనమో లెక్కా.. ప్రజలు ఓపిక ఉన్నంత కాలమే ఎవ్వరినైనా భరిస్తారు.. అంతే కానీ అధికారం ఉంది కదా అని ఇష్టమెచ్చినట్లు చేస్తే ప్రజలు ఐదేండ్లు భరిస్తారెమో కానీ నేను మాత్రం ఐదు రోజులు కూడా భరించను గాక భరించను.. ఇకనైనా జాగ్రత్త ఉండు.. లేకుంటే అంతే సంగతులు అంటూ ఇప్పుడు ఓ ఎమ్మెల్యేకే సీఎం జగన్ క్లాస్ పీకాడట..
జగన్ చెప్పింది వాస్తవమే కదా.. జనంలో ఉన్నంత కాలం.. జనంకు పని చేసినంత కాలం.. జనంతో మమేకమైనంత కాలం.. ప్రజాప్రతినిధులకు మనుగడ.. అదే జనాలకు తిక్కరేగిందంటే.. తుక్కు తుక్కు చేస్తారు.. ఇప్పటి ప్రతిపక్షం లాగా.. ఇది తెలిసిన ఏపీ సీఎం జగన్ పార్టీలో తిక్కతిక్క చేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి దిమ్మతిరిగే క్లాస్ పీకాడట.. అంతే కాదు.. ఇకముందైనా జాగ్రత్తగా పనిచేసుకో.. లేకుంటే.. దగ్గరోడని కూడా చూడను.. పీకీపారేస్తా అని ఘాటుగానే హెచ్చరించారట. ఇటీవల నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓ మహిళా ఎంపీడీఓను దూషించి, ఇబ్బందులు పెట్టిన విషయంలో సీఎం జగన్ మనస్థాపం చెందారట.. ఎమ్మెల్యే కోటంరెడ్డి వ్యవహరశైలీతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని బాధ పడిన సీఎం వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగారట..
వెంటనే వైఎస్సార్ సీపీ నేతలను రంగంలోకి దింపి ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాకాణి గోవర్థన్‌రెడ్డిలతో మంతనాలు జరిపి సమస్యను మొగ్గలోనే తుంచారట.. ఇకముందు కలహాలు మానుకోవాలని, సమన్వయంతో పనిచేసుకోవాలని వైఎస్సార్ నేతలు ఇద్దరి హితబోధ చేసారట.. అయితే సీఎం జగన్ మాత్రం కోటంరెడ్డిని ప్రత్యేకంగా పిలుచుకుని మందలించారట.. ఓవైపు మందలిస్తూనే అనేక హితబోధలు చేసి ఇకముందు నీవు అమరావతిలో నిత్యం అందుబాటులో ఉండాలని, అభివృద్ధి నేను చూసుకుంటానని కోటంరెడ్డికి మాటిచ్చారట సీఎం జగన్. ఏదేమైనా కర్రవిరగకుండా, పాము చావకుండా వ్యవహారం చక్కదిద్దడంలో సీఎం జగన్ బాగా నేర్పరిగా తయారయ్యాడనే టాక్ వినిపిస్తుంది. లౌక్యంతో కోటంరెడ్డిని తనదారిలోకి తెచ్చుకుని మరో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ లాగా కాకుండా చేసుకున్నాడన్న మాట.. ఎంతైనా జగన్ వారసత్వం అలాంటిది మరి..