ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ మోహన్ రెడ్డి తో టాలీవుడ్ స్టార్ హీరో, మెగాస్టార్ చిరంజీవి సమావేశం అయ్యారు. కాసేపటి క్రితమే.. సీఎం జగన్ మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్న చిరంజీవి.. సీఎం జగన్ తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవికి పుష్ప గుచ్చం ఇచ్చి ఆహ్వానించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఇక టాలీవుడ్ పరిశ్రమ సమస్యలు, సినిమా టికెట్ల ధరలపై ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డితో చిరంజీవి చర్చించనున్నారు.
ఈ భేటీపై నాగార్జున స్పందించారు. మా అందరి గురించే చిరంజీవి, సీఎం జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారని ఆయన అన్నారు. బంగార్రాజు సినిమా విడుదలలో బిజీగా ఉండటం వల్లే చిరంజీవితో కలిసి వెళ్లలేకపోయానని ఆయన అన్నారు. జగన్ తో చిరంజీవి భేటీ అవుతారని గతంలోనే నేను చెప్పానని..జగన్ తో చిరంజీవికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. జగన్ కు చిరంజీవి అంటే ఇష్టం అని నాగార్జున అన్నారు.