“RRR” మూవీ మాస్టర్ పీస్, మైండో బ్లోయింగ్‌ : చిరంజీవి ట్వీట్‌

-

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, స్టార్ డైరెక్ట‌ర్ ఎస్ ఎస్ రాజ‌మౌళి కాంబినేషన్ లో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ఈ రోజు పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల అయిన విషయం తెలిసిందే. బెనిఫిట్ షోల‌తో ఒక రోజు ముందు నుంచే మెగా, నంద‌మూరి ఫ్యాన్ ర‌చ్చ ర‌చ్చ చేస్తున్నారు. అభిమానులు, సెల‌బ్రెటీలు అని తేడా లేకుండా.. అంద‌రూ ఈ సినిమా చూడ‌టానికి క్యూ క‌డుతున్నారు.

సినిమా వేరే లెవల్‌లో తీసిన రాజమౌళికి, అత్యద్భుతంగా పర్ఫార్మ్ చేసిన హీరోలు తారక్, చెర్రీలకు థాంక్స్ చెప్తున్నారు. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడు బాగుందనే చెబుతున్నాడు. అయితే.. ఈ సినిమా చూసిన మెగాస్టార్‌ చిరంజీవి కూడా రివ్యూ ఇచ్చేశాడు. ”ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ఓ మాస్టర్‌ పీస్‌, మైండ్‌ బ్లోయింగ్‌. ఇలాంటి సినిమా ఎప్పుడూ చూడలేదు. ఇద్దరు హీరోలు ఎన్టీఆర్‌, చరణ్‌ లు బాగా యాక్టింగ్‌ చేశారు. అటు రాజమౌళి దర్శకత్వం బీభత్సం” అంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ పై కామెంట్‌ చేశారు చిరంజీవి.

Read more RELATED
Recommended to you

Latest news