మెగాస్టార్ చిరంజీవి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు మళ్ళీ బయటపడ్డాయి. అనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా జరుగుతోంది .ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసిపి అధినేత వైయస్ జగన్ తనకు రాజ్యసభ ఇస్తారని చిరంజీవి ప్రధానంగా నమ్మారు .ఈ మేరకు ఆయన ఆశలు కూడా పెట్టుకున్నారు. రాజ్యసభ సీటు కోసం బీజేపీ పెద్దలతో లాబీయింగ్ కూడా చేసే ప్రయత్నం చేశారు చిరంజీవి.
కానీ జగన్ మాత్రం పవన్ కళ్యాణ్ టిడిపితో కలిసి ఉండటంతో పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏం చెప్తే అది చేస్తున్న నేపథ్యంలో ఎక్కడ తనకు తలనొప్పులు వస్తాయో అని భావించి చిరంజీవిని జగన్ పక్కన పెట్టారు. దీనికంటే ముందు దాని వల్ల ఉపయోగాలు ఒకవేళ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతారు. కానీ నీకు అధికారం రాదని మహా అయితే మంచి రావడం మినహా ఎలాంటి లాభాలు లేవని ఎలాగూ కాపు సామాజిక వర్గం ఎప్పుడూ ఒక వైపు కాబట్టి జనసేన పార్టీ లాభపడే సూచనలు ఏమాత్రం లేవని ఎలాగో 2019 ఎన్నికల్లో ఒక్క అసెంబ్లీ సీట్లు మాత్రమే వచ్చింది కాబట్టి టీడీపీ తో స్నేహం చేయడం కంటే జగన్ తో స్నేహం చేయడం మేలని పవన్ కళ్యాణ్ కి సూచించారట చిరంజీవి.
చిరంజీవి సూచనలను పవన్ కళ్యాణ్ ఏ మాత్రం పట్టించుకోలేదని అందుకే వీరి మధ్య విభేదాలు వచ్చాయని అంటున్నారు 2009 ఎన్నికల తర్వాత ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే విషయంలో ఏ మాత్రం పవన్ కళ్యాణ్ సలహాలను చిరంజీవి తీసుకోలేదని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అందుకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ చిరంజీవి సూచనలను పక్కన పెట్టేశారు అని అంటున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి కుటుంబాల మధ్య ఇప్పుడు మళ్లీ దూరం పెరిగిందని సినీ వర్గాల్లో కూడా చర్చలు జరుగుతున్నాయి.