చిరంజీవి వాల్తేరు వీరయ్య ఫస్ట్ డే కలెక్షన్స్..బ్లాక్ బాస్టర్ పక్కా..!

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఆయన క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలలో నటించి స్వయంకృషితో పైకెదిగి మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన ఎంతోమందికి ఆదర్శమని చెప్పవచ్చు. శ్రీకాంత్ , రవితేజ, నేచురల్ స్టార్ నాని లాంటి హీరోలు కూడా నేడు స్వయం కృషితో ఇండస్ట్రీలోకి వచ్చి స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు అంటే వారందరికీ ఆదర్శం మెగాస్టార్ చిరంజీవి అని చెప్పాలి. ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి తాజాగా నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య . ఈ సినిమా జనవరి 13వ తేదీన సంక్రాంతి పండుగ కానుకగా విడుదలై మొదటి షో తోనే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.

ఇకపోతే నిన్న విడుదలైన ఈ సినిమా నిన్నటి రోజున ప్రపంచవ్యాప్తంగా ఎంత కలెక్షన్స్ వసూలు చేసింది అనే విషయానికి వస్తే..

నైజాం – రూ.6.10 కోట్లు
సీడెడ్ – రూ.4.20 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.57 కోట్లు
ఈస్ట్ – రూ.2.68 కోట్లు
వెస్ట్ – రూ.2.06 కోట్లు
గుంటూరు – రూ.2.75 కోట్లు
కృష్ణ – రూ.1.49 కోట్లు
నెల్లూరు – రూ.1.05 కోట్లు

రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి మొత్తం రూ. 22.90 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయగా.. రూ. 35.80 కోట్ల గ్రాస్ నమోదు చేసినట్లు సమాచారం. కర్ణాటక అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.1.65 కోట్ల కలెక్షన్ వసూలు చేయగా.. ఓవర్సీస్ లో రూ.4.75 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఓవరాల్ గా ఈ సినిమా రూ.20 కోట్లు వస్తే చాలు అని అనుకున్న సినిమాకు.. ఏకంగా రూ.29.3 కోట్ల షేర్ మార్కును దాటేసి ఊచకోత కోసింది. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.88 కోట్లపైగా జరిగినట్లు సమాచారం. ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే మరో రూ.59.70 కోట్లు రాబడితే చాలు సినిమా సక్సెస్ అయినట్టే.

Read more RELATED
Recommended to you

Latest news