చిరంజీవి సినిమాల నుంచి తప్పుకుంటున్నారా…?

-

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన టాలీవుడ్ ని దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఒక ఊపు ఊపుతున్నారు. అటు మాస్, ఇటు క్లాస్ ని ఆయన ఆకట్టుకున్నారు. ఇప్పుడు రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకుంది.

అయితే కరోనా కారణంగా కొన్ని రోజులు ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఇది పక్కన పెడితే ఆయన సినిమాల నుంచి తప్పుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన… లూసిఫర్ అనే రీమేక్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి ఆ తర్వాత సినిమాల నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నారట. ప్రస్తుతం ఈ సినిమా కోసం బాగానే కష్టపడుతున్నారు.

అయితే సినిమాలకు ఆయన శరీరం సహకరించడం లేదని, అందుకే సినిమాలకు దూరమవ్వాలని భావిస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. రామ్ చరణ్ కూడా తన తండ్రిని సినిమాలు చేయమని ఒత్తిడి చేయడం లేదని అంటున్నారు. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి. కొరటాల శివ తో చేసే సినిమా దసరాకు విడుదల అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news