జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ కు నా పూర్తి మద్ధతు : చిరంజీవి

-

గాడ్‌ ఫాదర్‌ ప్రెస్‌ మీట్‌ లో మెగాస్టార్‌ చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ కు నా పూర్తి మద్ధతు ఉంటుందని ప్రకటించారు చిరంజీవి. భవిష్యత్‌లో జనసేనకు మద్దతు ఇస్తానో లేదో తెలీదని.. పవన్ నా తమ్ముడు.. మంచి నాయకుడు అవుతాడన్నారు చిరంజీవి.

రాష్ట్రాన్ని ఏలే నాయకుడు కావొచ్చని.. పవన్ నిజాయితీ, నిబద్దత చిన్నప్పటి నుంచి నాకు తెలుసు అని వెల్లడించారు. పవన్ లాంటి నిబద్దత ఉన్న నాయకుడు కావాలని…. పవన్‌కు నా పూర్తి మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు మెగాస్టార్‌ చిరంజీవి. మరోక పక్క ఉండకూడదనే.. నేను రాజకీయాల నుంచి వైదొలిగానని.. పవన్ రాజకీయంగా ఎదిగేందుకే.. నేను బయటకు వచ్చానన్నారు చిరంజీవి. ఇక మెగాస్టార్‌ చిరంజీవి చేసిన తాజా వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు మరోసారి హాట్‌ హాట్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news