MothersDay : తల్లితో ముగ్గురు మెగా హీరోలు..వీడియో వైరల్

-

మాతృమూర్తి ఔన్యత్వాన్ని గుర్తు చేసుకునే రోజు మదర్స్‌ డే. ఈ సృష్టికి మూలం ఆ భగవంతుడు అవునో కాదో తెలియదు కానీ.. మానవ సృష్టికి మూలం మాత్రం అమ్మే అన్న విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. మనలనున ఓ కొత్త ప్రపంచానికి పరిచయం చేసే ఆ మాతృ మూర్తికి మనసారా వందనాలు తెలియజేయడం మనందరి కర్తవ్యం. ఇక సామాన్యుల నుంచి సెలబ్రీటీల వరకు ప్రతి ఒక్కరూ కూడా అమ్మ ప్రేమకు ఫిదా అవ్వని వారు ఎవ్వరూ ఉండరు.

ఇక మెగా ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ములకు వాళ్ల తల్లి అంజనా దేవి అంటే చాలా ఇష్టం. ఎంతో అమితమైన ప్రేమ కలిగి ఉంటారు. చిరంజీవి అయితే.. ఇప్పటికీ.. తల్లితో.. ఒక్క చిన్న పిల్లాడిగా గారం చేస్తూ ఎంతో ప్రేమగా చూసుకుంటారు. అయితే.. ఇవాళ మదర్స్‌ డే సందర్భంగా.. తన తల్లితో.. ఉన్న వీడియోను చిరంజీవి షేర్‌ చేసి.. మదర్స్‌ డే శుభాకాంక్షలు చెప్పారు. ఈ వీడియోలో.. పవన్‌, చిరు, నాగాబాబు తమ తల్లితో ఉన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version