ప్రధాని మోదీ అణు యుద్ధాన్ని ఆపి.. పెను విధ్వంసాన్ని తప్పించారని అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) డైరెక్టర్ బిల్ బర్న్స్ తెలిపారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. అణ్వాయుధాల వినియోగంపై మోదీ ఆలోచనలు రష్యాపై ప్రభావం చూపాయని అన్నారు. ఫలితంగా, ఉక్రెయిన్ యుద్ధంలో పెను విధ్వంసం తప్పిందని చెప్పుకొచ్చారు.
“చైనా ప్రధాని షీ జిన్పింగ్తో పాటు ప్రధాని మోదీ సైతం అణ్వాయుధాల వినియోగం గురించి తమ ఆందోళనలను లేవనెత్తారు. ఈ విషయం రష్యన్లపై ప్రభావం చూపింది. అణ్వాయుధాల ఉపయోగంపై రష్యా ఉద్రిక్తతలు కేవలం రెచ్చగొట్టడానికి మాత్రమే. అణ్వాయుధాలు వాడటానికి రష్యా సన్నద్ధమవుతున్నట్లు ఆధారాలేవీ లేవు” అని బిల్ బర్న్స్ పేర్కొన్నారు.