ఉమా టాబ్ సీఐడీ కి దొరుకుతుందా లేదా…?

6 గంటలుగా మాజీమంత్రి దేవినేని ఉమాను సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు,వీడియో మార్ఫింగ్ పై విచారించిన సిఐడి అధికారులు… కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. దేవేనేని ఉమా సంబంధించిన న సోషల్ మీడియా పోస్టింగ్స్ పై సీఐడీ అధికారులు అరా తీస్తున్నట్టు గా సమాచారం. సోషల్ మీడియా నిర్వహణ ఎవరు చూస్తోరో చెప్పాలి అంటూ ఉమా ను అధికారులు ప్రశ్నించారు.

టాబ్ పైనే సుదీర్ఘంగా ఎక్కడ అంటూ విచారణ జరిపినట్టు తెలుస్తుంది. టాబ్ పోయిందని మరోమారు మాజీమంత్రి ఉమా సమాధానం చెప్పారు. సాంకేతిక పరిజ్ఞానం లో టాబ్ ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం సి.ఐ.డి అధికారులు… చేస్తున్నారు. దర్యాప్తు మొత్తం టాబ్ చుట్టునే ఉంది. రేపు మరలా విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం.